Begin typing your search above and press return to search.
మాజీ భార్యను చైతన్య వ్యక్తిగతంగా కలిశాడా..?
By: Tupaki Desk | 2 Nov 2022 5:13 AM GMTఅగ్ర కథానాయిక సమంత రూత్ ప్రభు గత కొంతకాలంగా మైయోసైటిస్ అనే ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించడం అందరికీ షాక్ కు గురి చేసింది. అభిమానులు మరియు పలువురు సినీ ప్రముఖులు సామ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కోరుకుంటున్నారు. అయితే దీనిపై ఆమె మాజీ భర్త అక్కినేని నాగచైతన్య స్పందించలేదనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సమంత ఆరోగ్యంపై ఎలాంటి ట్వీట్ చేయని చైతన్య.. ఈరోజు ఉదయం ఎయిర్ పోర్ట్ రన్ గురించి ట్వీట్ చేశారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ రన్ 2వ ఎడిషన్ జరగనుందని.. అందరినీ నవంబర్ 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు సరదా సాయంత్రంలో కలుద్దామని ఎదురుచూస్తున్నానని చై ట్వీట్ లో పేర్కొన్నారు. దీనికి నెటిజన్లు స్పందిస్తూ.. సామ్ కు ధైర్యం చెబుతూ ఎందుకు పోస్ట్ పెట్టలేదని కామెంట్స్ పెడుతున్నారు.
అయితే చైతూ తన మాజీ భార్యను వ్యక్తిగతంగా కలిసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సమంత ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని నాగ చైతన్య నేరుగా వెళ్లి ఆమెను పరామర్శించారట. అయితే ఈ విషయం ఎక్కడా బయటకు రాలేదు.
నిజానికి అంత పెద్ద సెలబ్రిటీ ఒక హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నప్పుడు.. ఏ విషయాన్ని సీక్రెట్ గా ఉంచలేరు. ఎవరెవరు వచ్చి కలుస్తున్నారనేది ఎలాగోలా మీడియాకు వచ్చేస్తుంది. అలాంటప్పుడు నాగచైతన్య తన మాజీ భార్యను కలిసిన విషయం ఎందుకు బయటకు రాలేదు? అనే ప్రశ్నలు తలెత్తుతాయి.
సామ్ ఇటీవల బెడ్ పై ఉన్న ఫోటో షేర్ చేసి తన వ్యాధి గురించి తెలిపింది. అయితే ఆ ఫోటో ఆసుపత్రిలో తీసినది కాదట. ఆమె హైదరాబాద్ లోని తన ఇంట్లోనే వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్ మెంట్ తీసుకుంటోందని అంటున్నారు. అందుకే చైతన్య వెళ్లి కలిసిన విషయం బయటకు తెలియలేదని నివేదికలు పేర్కొంటున్నాయి.
ప్రేమ వివాహం చేసుకున్న నాగచైతన్య - సమంత.. ఏడాది క్రితం విడిపోతున్నట్లు ప్రకటించారు. భార్యాభర్తలుగా విడిపోయి స్నేహితులుగా కలిసుంటామని తెలిపారు. అప్పటి నుంచి వేర్వేరుగా ఉంటున్న ఈ మాజీ కపుల్.. పబ్లిక్ గా మళ్లీ కలుసుకోలేదు. అయితే వీరిద్దరూ పలు ఇంటర్వ్యూలలో ఒకరి గురించి ఒకరు పరస్పర విరుద్ధంగా స్పందించారు.
ఇకపోతే సమంత ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నట్లు ప్రకటించిన తర్వాత అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇద్దరు హీరోలు స్పందించారు. అఖిల్ మరియు సుశాంత్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ఆమె త్వరగా కోలుకోవాలని.. అందుకు తగినంత బలం చేకూరాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఇప్పుడు నాగచైతన్య కూడా పర్సనల్ గా సామ్ ను మీట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతనేది తెలియదు కానీ.. ఈ వార్త అభిమానులను సంతోషాన్ని కలిగిస్తోంది. ఏదేమైనా సమంత సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా తిరిగి రావాలని ఆమె శ్రేయోభిలాషులు అందరూ కోరుకుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.