Begin typing your search above and press return to search.
'నాంది' నిర్మాత మరో ప్రయోగంకు రెడీనా?
By: Tupaki Desk | 3 July 2021 4:30 PM GMTఅల్లరి నరేష్ హీరోగా చాలా కాలం తర్వాత సక్సెస్ దక్కించుకున్న సినిమా నాంది. అల్లరి నరేష్ లో కామెడీ యాంగిల్ మాత్రమే కాకుండా సీరియస్ యాంగిల్ కూడా ఉందని నిరూపించిన సినిమా నాంది. తెలుగు లో ఇలాంటి సినిమాలు చేయాలంటే ఘట్స్ ఉండాలి. నాంది వంటి ప్రయోగాత్మక సినిమాను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న మేకర్స్ మరో ప్రయోగంను చేసేందుకు సిద్దం అవుతున్నారనే టాక్ వినిపిస్తుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నాంది చిత్ర నిర్మాత సతీష్ వేగేశ్న మరో ప్రయోగాత్మక స్క్రిప్ట్ ను పట్టుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఆయన ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ పై వర్క్ చేయిస్తున్నాడట. అతి త్వరలోనే ఆ సినిమాను ప్రకటిస్తారని మీడియా సర్కిల్స్ లో కూడా చర్చ జరుగుతోంది.
నాంది సినిమా తో అభిరుచి కలిగిన నిర్మాతగా పేరు దక్కించుకున్న సతీష్ వేగేశ్న రెండవ ప్రయత్నంలో కూడా అదే తరహా విభిన్న కథ మరియు ప్రయోగాత్మక సబ్జెక్ట్ ను తీసుకోవడం ఆయన సాహస నిర్ణయంగా చెప్పుకోవచ్చు. నిర్మాత సతీష్ వేగేశ్న నిర్మించబోతున్న రెండవ సినిమా మహిళ లు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో ఉంటుందనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇలాంటి లేడీ ఓరియంటెడ్ కాన్సెప్ట్ లు కమర్షియల్ గా ఎంత వరకు ఆకట్టుకుంటాయి అనేది చెప్పలేం. కాని ఒక మంచి సోషల్ మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఆయన ఈ సినిమాను మొదలు పెట్టాలని భావించడం అభినందనీయం అంటున్నారు.
ఈ మద్య కాలంలో లేడీ ఓరియంటెడ్ సినిమా లకు కూడా మంచి టాక్ వచ్చిన సందర్బాలు ఉన్నాయి. మంచి మెసేజ్ ఉన్న సబ్జెక్ట్ లను తీసుకుని కాస్త కమర్షియల్ టచ్ ఇచ్చి సినిమా లను తెరకెక్కిస్తే తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు కూడా ఆ ప్రయోగాత్మక సినిమా లను ఆదరిస్తున్నారు. అల్లరి నరేష్ నాంది సినిమా విషయంలో రివ్యూలు మిశ్రమంగా వచ్చాయి. ప్రేక్షకులు ఈ సినిమా ను ఆధరించడం అనుమానమే అన్నారు. కాని నాంది సినిమా అన్ని ప్లాట్ ఫామ్ లపై కూడా మంచి సక్సెస్ అవ్వడంతో పాటు ఇప్పుడు దిల్ రాజు మరియు అజయ్ దేవగన్ లు కలిసి హిందీ లో రీమేక్ చేసేందుకు సిద్దం అయ్యారు. నిర్మాత సతీష్ వేగేశ్న రెండవ సినిమా పై మరింత స్పష్టత ఎప్పుడు వస్తుందో చూడాలి.