Begin typing your search above and press return to search.

నాని విజయ్ ని క్రాస్ చేయలేడా ?

By:  Tupaki Desk   |   24 April 2019 7:56 AM GMT
నాని విజయ్ ని క్రాస్ చేయలేడా ?
X
న్యాచురల్ స్టార్ నాని జెర్సీ టాక్ రిపోర్ట్స్ విషయంలో ఎలాంటి అనుమానాలు సందేహాలు లేవు. యునానిమస్ గా బ్లాక్ బస్టర్ స్టాంప్ పడిపోయింది. చూసిన ప్రతి ఒక్కరు అందులో ఎమోషన్ కు కనెక్ట్ అయిపోయి ప్రశంశల జల్లులు కురిపిస్తున్నారు. నిజానికి ఇంత రెస్పాన్స్ వచ్చిన సినిమాకు కనీసం మూడు వారాల పాటు హౌస్ ఫుల్ బోర్డులు పడిపోవాలి. వారాంతాలు వీక్ డేస్ అనే భేదం లేకుండా టికెట్ల కోసం రద్దీ కొనసాగాలి. కాని జెర్సీ పరిస్థితి అలా లేదు.

కలెక్షన్స్ స్టడీగా ఉన్నప్పటికీ భీభత్సంగా అయితే లేవన్నది ట్రేడ్ టాక్. షో టైంకు హౌస్ ఫుల్ అవుతున్నా ముందస్తు బుకింగ్స్ విషయంలో కాస్త స్లోగానే ఉందని సదరు యాప్స్ చూస్తేనే అర్థమైపోతోంది. ధియేట్రికల్ బిజినెస్ రూపంలో చేసిన 26 కోట్లను షేర్ రూపంలో వెనక్కు తేవలసిన బాద్యత జెర్సీ మీదుంది.

కాని ఇక్కడో విషయం గమనించాలి. విజయ్ దేవరకొండ హవా కంటే ముందు మార్కెట్ లో స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్న నాని ఇప్పుడు తన సినిమాల ద్వారా అతన్ని బీట్ చేయలేకపోతుండటం గమనార్హం. గీత గోవిందం సోలోగా 62 కోట్ల దాకా షేర్ రాబట్టింది. అర్జున్ రెడ్డి తక్కువేమీ తినలేదు. 40 కోట్ల దాకా నమోదు చేసింది. విజయ్ దేవరకొండ హీరో కాకపోయినా ఓ భాగంగా నిలిచిన మహానటి సైతం 45 కోట్ల లెక్కలు చూపించింది. ఇదంతా షేరే. గ్రాస్ అంటే లెక్కలు మారతాయి.

మరి నాని జెర్సీ ఇంత పెద్ద హిట్ టాక్ వచ్చింది కాబట్టి కనీసం 40 కోట్ల షేర్ దాటాలి. కాని అది జరిగే పనిలా కనిపించడం లేదు. అవెంజర్స్ ఎండ్ గేమ్ రూపంలో థ్రెట్ ఉన్నప్పటికీ అది మరీ దారుణంగా దెబ్బ తీసే ప్రబావం అయితే కాదు. మరి జెర్సీ ఇప్పుడు రాబోయే వీకెండ్ తో పాటు ఇంకో పది పదిహేను రోజుల్లో ఎంత స్టడీగా కలెక్షన్లు నిలబెట్టుకుంటుంది అనే దాని మీదే ఫైనల్ స్టేటస్ ఆధారపడి ఉంది