Begin typing your search above and press return to search.

కొంపతీసి నయన పెళ్ళి చేసేసుకుందా??

By:  Tupaki Desk   |   16 May 2016 3:30 PM GMT
కొంపతీసి నయన పెళ్ళి చేసేసుకుందా??
X
నిన్న ''బాబు బంగారం'' టీమ్‌ షేర్‌ చేసిన ఒక ఫోటో చూసి.. మధ్యలో కురియన్‌ ఎవరబ్బా అంటూ మనం మాట్లాడుకున్నాం గుర్తుందిగా? అయితే ఈ ఫోటోతో ఇప్పుడు మరొక చిక్కొచ్చిపడింది. డయానా మరియమ్‌ కురియన్‌ కోసం ''కురియన్‌'' అంటూ ఛైర్‌ ఏర్పాటు చేశారు కరక్టే.. కాకపోతే అక్కడి ''మిస్సెస్‌ కురియన్'' అని రాశారు. అది చూసిన జనాలు షాకేగా మరి.

నిజానికి అప్పట్లో నయనతార ''నేను రౌడీనే'' సినిమా డైరక్టర్‌ విఘ్నేష్‌ శివన్‌ ను ప్రేమిస్తోందని వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఇద్దరూ కలసి హగ్‌ చేసుకుని ఒక సెల్ఫీ దిగి.. దానిని వాట్సాప్‌ లో పెట్టారు. ఇంకేముంది.. మ్యాటర్‌ ఊరంతా తెలిసిపోయింది.. నయన మాత్రం పర్సనల్‌ అని కవర్‌ చేసింది. అయితే నిజంగానే అతగాడిని పెళ్లిచేసుకుని అమ్మడు మ్యాటర్‌ సీక్రెట్‌ గా ఉంచిందా? లేకపోతే పొరపాటను ఫారిన్‌ షూటింగ్‌ కో ఆర్టినేటర్‌ అలా మిస్సెస్‌ అని రాయించేశాడా? సాదారణంగా అక్కడ పాసుపోర్టు కాపీలను చేతిలో పెట్టుకోకుండా ఇలాంటి రాయరు.. సో.. తప్పు జరిగే అవకాశం లేదు మరి.

ఇదంతా ఒకెత్తయితే.. ఒకవేళ ఈ సినిమాలో ఏమన్నా నయనతార మిస్సెస్‌ కురియన్‌ అనే పాత్రను చేస్తోందా అనే సందేహం కూడా వస్తోంది. బాబు బంగారం.. ఏంటమ్మా ఈ నయన పెళ్ళి మ్యాటర్‌ సీక్రెట్‌?