Begin typing your search above and press return to search.
నిఖిల్ మూవీ అందుకే అక్కడ రిలీజ్ కావడం లేదా?
By: Tupaki Desk | 7 Dec 2022 2:30 AM GMTమన హీరోల్లో చాలా మంది హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా జపం చేస్తున్నారు. ఏ సినిమా చేసినా దాన్ని పాన్ ఇండియా వైడ్ గా భారీ స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ యంగ్ హీరో నిఖిల్ మాత్రం తన లేటెస్ట్ మూవీని అలా రిలీజ్ చేయడం లేదని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ ఇటీవల నటించిన మిస్టరీ యాక్షన్ అడ్వెంచర్ 'కార్తికేయ 2. చందూ మొండేటి దర్శకత్వంలో పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు.
అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టు 13న భారీ స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అత్యంత భారీగా పాన్ ఇండియా మూవీగా విడుదలై సంచలన విజయాన్ని సాధించింది.
కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో ఊహించని విధంగా కనీవినీ ఎరుగని ఫిగర్ ని రాబట్టి ఆశ్చర్యపరిచింది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రూ. 120 కోట్లని రాబట్టి నిఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ వసూళ్లని రాబట్టిన సినిమాగా రికార్డు సాధించింది.
ఈ మూవీ విజయాన్ని దృష్టిలో పెట్టుకుని హీరో నిఖిల్ తన తదుపరి సినిమాలని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే తను నటించిన లేటెస్ట్ మూవీ '18 పేజెస్' ని మాత్రం ఆ స్థాయిలో రిలీజ్ చేయడం లేదు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించాడు. జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ 'కార్తికేయ 2' కు ముందు అంగీకరించినది.
అంతే కాకుండా ఈ సినిమాను పాన్ ఇండియాని టార్గెట్ చేస్తూ మేకర్స్ కానీ, హీరో కానీ చేయాలని ప్లాన్ చేసుకోలేదు. ఇదొక ఎమోషనల్ లవ్ స్టోరీ.. ఈ మూవీపై హీరో నిఖిల్ ఫుల్ కాన్ఫిడెంట్ తో వున్నాడట. కానీ సినిమాని మాత్రం 'కార్తికేయ 2' క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేయడం లేదని తెలుస్తోంది.
నార్త్ లో 'కార్తికేయ 2'తో మంచి మార్కెట్ ఏర్పడింది. దాన్ని '18 పేజెస్'క్యాష్ చేసుకోలేకపోతోందని అంటున్నారు. నార్త్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నా ప్రమోషన్స్ కి టైమ్ సరిపోదని టీమ్ వెనకడుగు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మూవీని డిసెంబర్ 23న రిలీజ్ చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.