Begin typing your search above and press return to search.
అవసరాల థ్రిల్లర్ సిరీస్ కి నిత్యా అంగీకరించిందా?
By: Tupaki Desk | 23 Oct 2020 3:30 PM GMTడిజిటల్లో సస్పెన్స్ థ్రిల్లర్ల హవా గురించి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ నెట్ ఫ్లిక్స్ సహా అన్ని ఓటీటీలు థ్రిల్లర్ సిరీస్ లతో ఆదరణను పెంచుకుంటుంటున్నాయి. ఇక థ్రిల్లర్ సిరీస్ లలో నటించేందుకు స్టార్లు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. అదే కోవలో ఇంతకుముందు నిత్యామీనన్ - అభిషేక్ బచ్చన్ నటించిన ‘బ్రీత్: ఇంటు ది షాడోస్’ హిందీ వెబ్ సిరీస్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
ఆ తర్వాత నిత్యా మరో థ్రిల్లర్ సిరీస్ చేసేందుకు అంగీకరించిందని సమాచారం. ఈసారి దర్శకుడు అవసరల శ్రీనివాస్ భారీ బడ్జెట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సిరీస్ లో ప్రధాన పాత్ర పోషించాలని నిత్యా మీనన్ ని అడిగారట. కొన్ని చర్చల అనంతరం ఈ సిరీస్ చేయడానికి నిత్యా ఓకే చెప్పిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
నిత్యా తొలి నుంచి ప్రయోగాత్మక కంటెంట్ కి ప్రాధాన్యతనిస్తుంటుంది. ఇంతకుముందు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన అ! లాంటి విభిన్నమైన సినిమాకి అంగీకరించింది. తర్వాత బ్రీథ్ సిరీస్ అంతే ఆసక్తికరమైనది. ఇప్పుడు అవసరాలతో కంటెంట్ పరంగా మెప్పించడం వల్లనే అంగీకరించే అవకాశం ఉందని సమాచారం. అయితే నిత్యాని ఎంపిక చేసారా లేదా? అన్నది అధికారికంగా అవసరాల ప్రకటించాల్సి ఉంది. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ వెబ్ సిరీస్ ను ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ నిర్మించనుంది.