Begin typing your search above and press return to search.

'బాహుబ‌లి' ఫ‌స్ట్ పాన్ ఇండియా మూవీ కాదా?

By:  Tupaki Desk   |   5 May 2022 10:30 AM GMT
బాహుబ‌లి ఫ‌స్ట్ పాన్ ఇండియా మూవీ కాదా?
X
స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి తెర‌కక్కించిన భారీ బ‌డ్జెట్ విజువ‌ల్ వండ‌ర్ `బాహుబ‌లి`. 180 కోట్ల‌తో ఫ‌స్ట్ పార్ట్ ని, 250 కోట్ల‌తో సెకండ్ పార్ట్ ని అత్యంత భారీ స్థాయిలో భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో ఈ మూవీతో సువ‌ర్ణాధ్యాయానికి తెర‌లేపారు. దేశ వ్యాప్తంగా ఐదు భాష‌ల్లో సంచ‌ల‌న విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ గా తెలుగు సినిమా ఖ్యాతిని రెప రెప‌లాడించింది. వ‌సూళ్ల ప్ర‌రంగా ప్ర‌పంచ వ్యాప్తంగా స‌రికొత్త రికార్డులు సాధించ‌డ‌మే కాకుండా భార‌తీయ చిత్రాల్లో స‌రికొత్త చ‌రిత్ర‌ను సృష్టించింది.

వ‌ర‌ల్డ్ వైడ్ గా అన్ని భాష‌ల్లో 1800 కోట్ల పైచిలుకు వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి బాలీవుడ్ చిత్రం `దంగ‌ల్‌` త‌రువాత స్థానంలో నిలిచింది. ద‌క్షిణాది నుంచి తొలి పాన్ ఇండియా మూవీగా అంతా `బాహుబ‌లి`ని కీర్తించారు. జేజేలు ప‌లికారు. అయితే `బాహుబ‌లి` ఫ‌స్ట్ పాన్ ఇండియా మూవీ కాద‌ని తాజాగా బ‌య‌ట‌ప‌డింది. ఈ సినిమా త‌రువాత ఇదే పంథాలో భారీ స్థాయిలో తెర‌పైకొచ్చిన పుష్ప‌, ట్రిపుల్ ఆర్‌, కేజీఎఫ్ 2 దేశ వ్యాప్తంగా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ లు నిల‌వ‌డంతో పాన్ ఇండియా అనే ప‌దం మ‌రింత‌గా వినిపించ‌డం మొద‌లు పెట్టింది.

ప్ర‌స్తుతం రాజ‌మౌళి, ప్ర‌భాస్ లు బాహుబ‌లితో అందించిన కొత్త‌దారిని అనుస‌రిస్తూ తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ, మ‌ల‌యాళ‌ భాష‌ల్లో వ‌రుస‌గా పాన్ ఇండియా స్థాయి చిత్రాల నిర్మాణం ఊపందుకుంది. ఇప్ప‌టికే కొన్ని చిత్రాలు నిర్మాణ ద‌శ‌లో వుండ‌గా మ‌రి కొన్ని సెట్స్ పైకి వెళ్ల‌బోతున్నాయి. తెలుగులో `పుష్ప 2` త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ల‌డానికి రెడీ అవుతోంది. సుకుమార్ ఇటీవ‌ల `కేజీఎఫ్ 2` ఫ‌లితంతో పుష్ప స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఆయ‌న యుఎస్ లో స్క్రిప్ట్ కు ఫైన‌ల్ ట‌చ్ ఇచ్చే ప‌నిలో వున్నారు. హైద‌రాబాద్ తిరిగి రాగానే `పుష్ప 2`ని స్టార్ట్ చేస్తార‌ట‌.

ఇక త‌మిళంలో మ‌ణిర‌త్నం `పొన్నియ‌న్ సెల్వ‌న్‌` చేస్తున్నారు. ఇది రెండు భాగాలుగా తెర‌పైకి రానుంది. సెప్టెంబ‌ర్ 30న ఫ‌స్ట్ పార్ట్ ని విడుద‌ల చేస్తార‌ట‌. ఇక నేచుర‌ల్ స్టార్ నాని కూడా పాన్ ఇండియాపై క‌న్నేశాడు. కొత్త ద‌ర్శ‌కుడితో నాని `ద‌స‌రా` మూవీ చేస్తున్నాడు. ఇది ఐదు భాష‌ల్లో పాన్ ఇండియా వైడ్ గా విడుద‌ల కానుంది. క‌న్న‌డలో సుదీప్ హీరోగా `విక్రాంత్ రోణ‌` రాబోతోంది. ఇదే క‌న్న‌డ నుంచి ఉపేంద్ర హీరోగా `క‌బ్జా` కూడా పాన్ ఇండియాని టార్గెట్ గా పెట్టుకుంది. నిఖిల్ `స్పై`, సందీప్ కిష‌న్ `మైఖేల్ కూడా ఈ కోవ‌కు చెందిన చిత్రాలే.

అయితే పాన్ ఇండియా మూవీ అని ఇప్ప‌డు మ‌నం అనుకుంటున్న పాన్ సినిమా 30 ఏళ్ల కింద‌టే అంటే 1991లోనే వ‌చ్చింది. అదే `శాంతి క్రాంతి`. క‌న్న‌డ స్టార్ వి. ర‌విచంద్ర‌న్ న‌టించి డైరెక్ట్ చేసిన చిత్ర‌మిది. క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఏక కాలంలో దీన్ని తెర‌కెక్కించారు. ఈ నాలుగు భాష‌ల్లో వి. ర‌విచంద్ర‌న్ డైరెక్ట్ చేశారు. క‌న్న‌డ‌లో ర‌విచంద్ర‌న్ హీరోగా న‌టించ‌గా కీల‌క పాత్రల్లో ర‌మేష్ అర‌వింద్, జూహీ చావ్లా, ఖుష్బు, అనంత్ నాగ్, బాబ్ ఆంటోనీ న‌టించారు. ఇదే సినిమాని తెలుగులో నాగార్జున హీరోగా చేశారు. అయితే ర‌మేష్ అర‌వింద్ త‌ప్ప ర‌విచంద్ర‌న్ తో పాటు అంతా వాళ్లే న‌టించారు. త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ర‌జ‌నీకాంత్ హీరోగా న‌టించారు. జూహీచావ్లా హీరోయిన్ గా న‌టించింది.

ఇక ఈ చిత్రాన్ని అన్ని భాష‌ల్లోనూ ర‌విచంద్ర‌న్ తండ్రి వీరాస్వామి నిర్మించారు. వున్న‌దంతా ఇందులో పెట్టేశారు. అయితే చివ‌రి నిమిషంలో డ‌బ్బులు త‌క్కువ కావ‌డంతో `తంబి` (చంటి) రీమేక్ చేసి అది హిట్ కావ‌డంతో దాని వ‌ల్ల వ‌చ్చిన మొత్తంతో సినిమాని పూర్తి చేశారు. హంస‌లేఖ సంగీతం అందించిన ఈ చిత్రంలో మొత్తం 9 పాట‌లున్నాయి. అప్ప‌ట్లో ద‌క్షిణాదిలో హాట్ టాపిక్ గా మారిన `శాంతి - క్రాంతి` భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లై భారీ డిజాస్ట‌ర్ గా నిలిచింది. అయితే పాన్ ఇండియా రేంజ్ అటెమ్ట్ అనే ప్ర‌శంస‌ల్ని మాత్రం సొంతం చేసుకుంది.

అంతే కాకుండా రిస్క్ చేసి పాన్ ఇండియా సినిమా చేయాల‌ని ప్ర‌య‌త్నించిన ర‌విచంద్ర‌న్ పై కూడా ప్ర‌శంసలు కురిపించారు. అయితే హిట్ అయితే మ‌రోలా వుండేది. ఏది ఏమైనా మ‌హా మ‌హ స్టార్ లు వున్నా క‌న్న‌డ న‌టుడు ర‌విచంద్ర‌న్ ద‌క్షిణాదిలో ఫ‌స్ట్ పాన్ ఇండియా మూవీకి శ్రీ‌కారం చుట్ట‌డంతో ద‌క్షిణాదిలో ఈ త‌ర‌హా చిత్రాల‌తో ఆయ‌నే ఆద్యుడుగా నిలిచాడ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.