Begin typing your search above and press return to search.

రాజ‌శేఖ‌ర్ ఫ్యామిలీ కి నవంబ‌ర్ గండ‌మా?

By:  Tupaki Desk   |   15 Nov 2019 1:30 AM GMT
రాజ‌శేఖ‌ర్ ఫ్యామిలీ కి నవంబ‌ర్ గండ‌మా?
X
మంగ‌ళ‌వారం రాత్రి న‌టుడు రాజ‌శేఖ‌ర్ పెద్ద ప్ర‌మాదం నుంచి తృటి లో త‌ప్పించుకున్న సంగ‌తి తెలిసిందే. కారు మూడు ప‌ల్టీలు కొట్ట గా ముందు భాగం నుజ్జు నుజ్జు అయినా అదృష్ట‌వ‌ శాత్తు ఎలాంటి గాయాలు కాకుండా సేఫ్ గా బ‌య‌ట ప‌డ్డాడు. స‌కాలంలో ఎయిర్ బెలూన్స్ తెరుచుకుని ర‌క్షించాయి. దీంతో ఆయ‌న కుటుంబ స‌భ్యులు.. అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్ర‌మాదంపై ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో ఇదీ కార‌ణం అంటూ ర‌క‌ర‌కాల వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. ఆ విష‌యం ప‌క్క‌న‌ బెడితే రాజ‌శేఖ‌ర్ కార్‌ యాక్సిడెంట్ జ‌ర‌గ‌డం ఇది తొలి సారి కాదు. గ‌తం లోనూ పీవీ ఎక్స్ ప్రెస్ హైవే పై ప్ర‌మాదం జ‌రిగింది.

ఈ ప్ర‌మాదం లో రాజ‌శేఖ‌ర్ స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. యాక్సిడెంట్ కార‌ణ‌మైన‌ రామిరెడ్డి కార్‌ బాగా దెబ్బ తింద‌ని .. ఆయ‌న‌ తో రాజ‌శేఖ‌ర్ వాగ్వివాదానికి దిగార‌ని ప్ర‌చార‌మైంది. త‌న త‌ల్లి చ‌ని పోయిన బాధ‌ లో ఉండ‌టం డిప్రెష‌న్ లోకి వెళ్ల‌డం తోనే ప్ర‌మాదం జ‌రిగింద‌ని అప్ప‌ట్లో రాజ‌శేఖ‌ర్ వివ‌ర‌ణ ఇచ్చారు. ఈ ఘ‌ట‌న‌ పై రాజేంద్ర న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ లో కేసు న‌మోదైంది. ఈ ఘ‌ట‌న స‌రిగ్గా న‌వంబ‌ర్ నెల‌లోనే జ‌రిగింది. మంగ‌ళ‌వారం జ‌రిగిన యాక్సిడెంట్ కూడా న‌వంబ‌ర్ నెల‌ లో జ‌ర‌గ‌డ విశేషం. అంత‌కు ముందు రాజ‌శేఖ‌ర్ కుమార్తె శివానీ ప్ర‌యాణిస్తోన్న కారు జూబ్లిహిల్స్ పోలీస్ స్టేష‌న్ ఫ‌రిది లో అదుపు త‌ప్పి రొడ్డు ప‌క్క‌నే ఆగి ఉన్న మ‌రో కారును ఢీకొట్టింది.

దీంతో న‌ష్ట‌ ప‌రిహారంగా ల‌క్ష‌ల్లో ప‌రిహారం చెల్లించార‌ని వార్త‌లొచ్చాయి. ఈ ఘ‌ట‌న కూడా న‌వంబ‌ర్ నెల‌లో జ‌ర‌గ‌డం గ‌మ‌నించ‌ద‌గ్గ విష‌యం. ఇలా రాజ‌శేఖ‌ర్ కార్ రెండు సార్లు ప్ర‌మాదానికి గురికావ‌డం.. శివానీ కారు యాక్సిడెంట్..ఇవ‌న్నీ ఒకే నెల‌ల‌లో (న‌వంబ‌ర్ ) జ‌ర‌గ‌డం తో ఆయ‌న‌ అభిమానుల్లోఆందోళ‌న‌ నెల‌కొంది. సెంటిమెంటు ప‌రిశ్ర‌మ‌ లో ప్ర‌స్తుతం ఈ యాక్సిడెంట్లు చ‌ర్చాంశ‌నీయంగా మారాయి.