Begin typing your search above and press return to search.
ఓటీటీ అంటే బూతు కంటెంటేనా...?
By: Tupaki Desk | 27 July 2020 2:30 AM GMTడిజిటల్ వరల్డ్ లో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఓటీటీ.. అంటే 'ఓవర్ ది టాప్'. ఒకప్పుడు కొత్త సినిమాలు చూడాలంటే థియేటర్స్ కి వెళ్లేవారు. ఇప్పుడు కొత్త సినిమాలు ఇంట్లోనే కూర్చొని తమ పర్సనల్ స్క్రీన్ మీద ఓటీటీలలో చూసేస్తున్నారు. వీటితో పాటు వెబ్ సిరీస్ లు మరియు ఒరిజినల్ మూవీస్ కూడా అందుబాటులో ఉంటున్నాయి. మనకు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సినిమాలు విడుదల చేయడమన్నది కొత్త కానీ హాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉన్నదే. థియేటర్స్ గురించి ఆలోచించకుండా చాలా సినిమాలు ఓటీటీలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటున్నాయి. ఇండియన్ సినిమాకు థియేట్రికల్ బిజినెస్ పరంగా ఎలాంటి లోటూ ఉండకపోవడంతో ఇన్నాళ్లు అటువైపు చూడాల్సిన అవసరం రాలేదు. కానీ కరోనా వచ్చి పరిస్థితులన్నీ మార్చేసింది. గత నాలుగు నెలల నుండి అందరూ ఎంటెర్టైన్మెంట్ కోసం ఓటీటీల వైపే చూస్తున్నారు. దీంతో ఓటీటీలకు విపరీతంగా ఆదరణ పెరిగింది. అయితే ఓటీటీలో వచ్చే కంటెంట్ కి సెన్సార్ లేకపోవడంతో అస్లీల కంటెంట్ ఎక్కువ అయిపోయింది అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. నిజానికి ఓటీటీలో బాగా ఆదరణ దక్కించుకున్న వెబ్ సిరీస్ లు చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది.
ఇటీవల ఓటీటీలలో స్ట్రీమింగ్ అయిన 'మస్టరమ్' 'Fబుడ్డీస్' లాంటి వెబ్ సిరీస్ లు బాగా పాపులర్ అయ్యాయి. అయితే ఇవి అడల్ట్ కంటెంట్ ని బేస్ చేసుకొని తీసిన వెబ్ సిరీసులు. ఇవే కాకుండా ఇప్పుడు ప్రముఖ ఓటీటీల్లో క్రేజ్ తెచ్చుకుంటున్న వెబ్ సిరీస్ మరియు ఒరిజినల్ మూవీస్ అన్నీ దాదాపు అడల్ట్ కంటెంట్ తో వచ్చినవే. వీటికి ఆదరణ లభిస్తుండటంతో ఓటీటీలు కూడా వీటి వైపే మొగ్గుచూపుతున్నాయనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని పెద్ద సంస్థలు, కొంతమంది నిర్మాతలు నేరుగా రంగంలోకి దిగి ఓటీటీ కోసం ప్రత్యేకంగా ఇలాంటి ఒరిజినల్ సినిమాలు వెబ్ సిరీస్ లు నిర్మించడానికి ప్రోత్సాహకాలు అందిస్తున్నారట. అందుకే రైటర్స్ డైరెక్టర్స్ అలాంటి కంటెంట్ రాయడానికి ముందుకొస్తున్నారని సమాచారం. ఒకప్పుడు థియేటర్స్ లో కూడా సెన్సార్ బోర్డు వారు ఇచ్చే 'ఏ' సర్టిఫికెట్ తో అడల్ట్ కంటెంట్ సినిమాలు ప్రదర్శించబడేవి. కాకపోతే ఇప్పుడు ఓటీటీ కంటెంట్ కి ఎలాంటి షరతులు లేకపోవడంతో హద్దులు లేకుండా చూపించేస్తున్నారని చెప్పవచ్చు. అందులోనూ యూత్ ఎక్కువగా ఇలాంటి వాటినే ఇష్టపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఇంతకుమించి కంటెంట్ ప్రసారం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.