Begin typing your search above and press return to search.
A సర్టిఫికెట్ ఇచ్చారు.. క్వీన్ అంతగా చెలరేగిందా?
By: Tupaki Desk | 18 May 2022 4:26 AM GMTసెన్సార్ బోర్డ్ సర్టిఫికేషన్ ఏ సినిమాకి అయినా అత్యంత కీలకం. క్లీన్ యు లేదా యుఏ సర్టిఫికెట్ ఇస్తేనే ఫ్యామిలీ ఆడియెన్ ఆ థియేటర్ల వైపు వెళతారు. అలాంటిది A సర్టిఫికెట్ ఇచ్చారంటే ఇక ఆ దరికి లేడీస్ కానీ పిల్లలు కానీ వెళ్లాల్సిన పని లేదని అర్థం.
మరి ఇప్పుడు క్వీన్ కంగన రనౌత్ నటించిన ధాకడ్ సన్నివేశమేంటో కానీ.. సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ తో పాస్ చేసింది. కంగనా రనౌత్ ప్రస్తుతం తన సినిమా ఢాకడ్ విడుదల ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఈ చిత్రంలో ఏజెంట్ అగ్ని పాత్రతో అదరగట్టబోతోంది.
కంగన పూర్తి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ అవతార్ లో కనిపించనుంది. రజనీష్ ఘై దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్- దివ్య దత్తా తదితరులు నటించారు. బాలీవుడ్ లో అరుదైన లేడీ ఓరియెంటెడ్ భారీ యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ విజువల్ ఫీస్ట్ గా నిలిచింది. ఇప్పుడు విడుదలకు మూడు రోజుల ముందు ధాకడ్ కి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా క్లియరెన్స్ దక్కింది. ఏ సర్టిఫికెట్ ఇవ్వడం తో ఇక ఈ థియేటర్ల వైపు కిడ్స్ విచ్చేస్తారా? అన్నది చెప్పలేం.
సినిమా మొత్తం రన్ టైమ్ 131 నిమిషాల 34 సెకన్లు (2 గంటలు 11 నిమిషాల 34 సెకన్లు). ఈ చిత్రంలో హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియాకి ఎదురెళ్లే కంగనా ఒక పెద్ద రాకెట్ ను ఛేదించే క్రమంలో జరిగే ఘర్షణ ఎలా సాగింది? అన్నది చూపించనున్నారు. తుఫాన్ వేగంతో శత్రువుపై విరుచుకుపడడం తుపాకులతో ఫైరింగ్ స్టంట్స్ వగైరా గగుర్పొడిచే రేంజులో తెరకెక్కించారని విజువల్స్ చెబుతున్నాయి.
ఇందులో విలన్ పాత్రలు పనాచే -ఎలాన్ తో ఏజెంట్ అగ్ని పోరాటాలు ఆద్యంతం రక్తి కట్టించనున్నాయి. ఓవైపు నేరుగా బరిలో దిగి చేసే పోరాటాలు సహా అనేక మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ .. ఇతర స్టంట్స్ ని కంగన నేర్చుకుంది. అర్జున్ రాంపాల్ ఇందులో క్రూరమైన విలన్ గా నటించాడు .
ప్రతినాయకుడిగా అతడి లుక్ నటన ఇతర సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని విజువల్స్ చెబుతున్నాయి. అతను తన లుక్ పాయింట్ అవుట్ కాకుండా జాగ్రత్త పడ్డాడు. యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రామాణికమైనవిగా కనిపించడానికి నటీనటులు నెలల తరబడి కష్టపడి శిక్షణ తీసుకున్నారు. అంతే కాదు కంగనా రనౌత్ - అర్జున్ రాంపాల్ మధ్య డ్యుయల్స్ స్టంట్స్ యాక్షన్ వీక్షకుల ఆడ్రినలిన్ ను ప్రేరేపించడం ఖాయమని ఇదివరకూ విడుదలైన ట్రైలర్ వెల్లడించిది.
బుడాపెస్ట్- ముంబై - భోపాల్ సహా పలు లొకేషన్లలో మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అవార్డ్ విన్నింగ్ జపనీస్ సినిమాటోగ్రాఫర్ టెట్సువో నగాటా చిత్రీకరించారు. యాక్షన్ కొరియోగ్రఫీని అంతర్జాతీయ సిబ్బంది రూపొందించారు. ధాకడ్ కి రజ్నీష్ ఘై దర్శకత్వం వహించారు . దీపక్ ముకుత్ - సోహెల్ మక్లై నిర్మించారు. కమల్ ముకుత్- సోహెల్ మక్లై ప్రొడక్షన్స్ - ఆశ్రయం చిత్రాలతో కలిసి సోహమ్ రాక్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో ఈ మూవీ తెరకెక్కింది. ధాకడ్ మే 20న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానుంది.

If you check all these, you are on Fire just like Agent Agni!