Begin typing your search above and press return to search.
పాల్ బయోపిక్ 'అపోకాలిప్టో' మేకర్ చేతుల్లోనా?
By: Tupaki Desk | 14 July 2022 12:30 AM GMT'ప్రజాశాంతి' పార్టీ వ్యవస్థాపకులు..అధ్యక్షులు..క్రైస్తవ మత బోధకులు..ఇంటర్నెట్ సంచలనం కె.ఏ పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాల్ ఎక్కడున్నా? అక్కడ హడావుడి మామూలుగా ఉండదు. పాల్ వాక్చుతర్యం.. సమకాలిన రాజకీయాలపై ఆయన చేసే వ్యాఖ్యలు సహా ఎంపిక చేసుకునే టాపిక్ ఏదైనా సరే పాల్ మార్క్ ప్రసంగం కనినపిస్తుంది.
కొంత కాలంగా క్రైస్తవ మత పనులకు దూరంగా ఉంటూ..రాజకీయాలపైనే ఎక్కువగా శ్రద్ద చూపుతున్నారు. ప్రజాశాంతి పార్టీతో ప్రజలకు సేవ చేయాలని పార్టీ స్థాపించిన దగ్గర నుంచి మీడియాలో ఎక్కువగా హైలైట్ అవుతున్నారు. తెలుగు రాష్ర్టాల రాజకీయాలపై ఎప్పటికప్పుడు తనదైన శైలిలో సందించడం...2024 ఎన్నికలకు తాను సిద్దమవుతోన్న వైనాన్ని రివీల్ చేయడం వంటి విషయాలతో పాల్ నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నారు.
ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు పాల్ కి అంతర్జాతీయంగా ఉన్న పరిచయాలు.. స్నేహాలు గురించి తెలిసింది చాలా తక్కువ మందికే. రాజకీయ పార్టీ స్థాపించక ముందు..దశాబ్ధాల క్రితం పాల్ క్రైస్తవ మత ప్రచారకులుగా ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు సంపాదించారు. అంతర్జాతీయ సమ్మిట్లకి సైతం హాజరైన ఘనత పాల్ సొంతం.
కాలక్రమంలో పాల్ ఆ క్రేజ్ ని కొల్పోయారు. అందుకు ఎన్నో రకాల కారణాలున్నాయి. ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన పాల్ అంచలంచెలుగా ఎదిగిన వైనం కూడా ఎంతో స్ఫూర్తి దాయకం. మరి ఇలాంటి వ్యక్తి కథ వెండి తెరకి ఎక్కవే అవకాశం లేదా? అంటే కచ్చితంగా చెప్పలేము గానీ...సరిగ్గా 15 ఏళ్ల క్రితం పాల్ జీవిత కథని తెరకెక్కించడానికి ఏకంగా హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మెల్ గిబ్స్ ముందుకొచ్చారుట.
పాల్ ఆమెరికాలో ఉండగా మెల్ గిబ్స్ కలిసి తన బయోపిక్ తీస్తానని అన్నారనుట. కానీ అందుకు పాల్ అప్పుడు ఒప్పుకోలేదుట. ఆ తర్వాత దివంగత దర్శకులు దాసరి నారాయణరావు ముంబైలో కలిసినప్పుడు ఇదే విషయంపై చర్చించగా పాల్ అప్పుడు కూడా ససేమీరా అన్నారుట. కానీ ఇప్పుడు అదే పాల్ తన బయోపిక్ తీస్తానంటే అడ్డు చెప్పనని వెల్లడించారు.
అయితే ఈ సినిమా రైట్స్ అప్పట్లోనే మెల్ గిబ్సన్ దక్కించుకున్నట్లు సమాచారం. మరి ఇది తెరకెక్కుతుందా? లేదా? అన్నది చెప్పకడం కష్టం గానీ.. మెల్ గిబ్సన్ మాత్రం హాలీవుడ్ లో స్టార్ మేకర్. 'ది మ్యాన్ వితౌట్ ఏ ఫేస్'..'బ్రేవ్ హార్ట్'.. 'ది ఫ్యాషన్ ఆఫ్ ది క్రిష్ట్' లాంటి చిత్రాలు తెరకెక్కించారు. ఇవి ఆయనకు దర్శకుడిగా మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.
ఆ తర్వాత తెరకెక్కించిన 'అపోకాలిప్టో' మాత్రం ప్రపంచ వ్యాప్తంగా సృష్టించిన సంచలనం గురించైతే చెప్పాల్సిన పనిలేదు. ఈ ఒక్క సినిమాతో మెల గిబ్సన్ ఎంతో ఫేమస్ అయ్యారు. అంత గుర్తింపు ఉన్నా ఆయన సినిమాలు చాలా రేర్ గానే చేస్తుంటారు. చివరిగా 'హ్యాక్ సా రిడ్స్' అనే చిత్రాన్నిఆరేళ్ల క్రితం తెరకెక్కించారు. ఆ తర్వాత సినిమాలు చేయలేదు. మరి పాల్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన నేపథ్యంలో మెల్ గిబ్సన్ ఆలోచిస్తారేమో చూడాలి.