Begin typing your search above and press return to search.
ఆ సీక్వెల్ వద్దులే పవన్
By: Tupaki Desk | 1 April 2018 8:12 AM GMT పవన్ కళ్యాణ్ కెరీర్ లో చాలా స్పెషల్ గా నిలిచిపోయిన బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్. ఒక బాలీవుడ్ తెలుగు రీమేక్ ఆ స్థాయి విజయం అందుకోవడం చూసి ఒరిజినల్ నిర్మాతలు కూడా ముక్కున వేలేసుకున్నారు. మాతృక హీరో సల్మాన్ ఖాన్ గబ్బర్ సింగ్ ఒరిజినల్ దబంగ్ సిరీస్ లో ఇప్పటి దాకా రెండు సినిమాలు చేసాడు. మొదటిది ఇండస్ట్రీ హిట్ కాగా దాన్నే పవన్ రీమేక్ చేసుకున్నాడు. దబాంగ్ 2 ఫస్ట్ పార్ట్ రేంజ్ హిట్ కాలేదు కాని కమర్షియల్ గా మాత్రం పాస్ అయ్యింది. కాని పవన్ కళ్యాణ్ దాని కథను తీసుకోకుండా గబ్బర్ సింగ్ సీక్వెల్ కు వేరే కథ రాసుకుని సర్దార్ గబ్బర్ సింగ్ గా తీస్తే పరాజయం పాలయ్యింది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 కోసం రెడీ అవుతున్నాడు. ప్రభుదేవా దర్శకత్వంలో దీన్ని తీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇప్పుడు పవన్ ఈ థర్డ్ పార్ట్ తీసుకుంటాడా అనే చర్చ మొదలైంది. జనసేన కార్యకలాపాల్లో బిజీ అయ్యాక ఇకపై సినిమాలు చేయను అని పవన్ ప్రకటించినప్పటికీ ఎన్నికలు అయ్యాక తిరిగి చేసే అవకాశాలు కొట్టి పారేయలేం. అప్పటి కంతా దబాంగ్ 3 విడుదల అయ్యుంటుంది. ఒకవేళ అది విజయం సాధిస్తే పవన్ మళ్ళి గబ్బర్ సింగ్ 3 కోసం ఏర్పాట్లు చేసుకోవచ్చు. కాని రెండో పార్ట్ ఫెయిల్ అయిన నేపధ్యంలో ఇక గబ్బర్ సింగ్ జోలికి వెళ్ళకుండా అది అలాగే వదిలేసి కొత్త కథలు ఎన్నుకోవాలని అధిక శాతం ఫాన్స్ కోరుకుంటున్నారు. కాని గబ్బర్ సింగ్ బ్రాండ్ అంటే పవన్ కు మక్కువ ఎక్కువ. సల్మాన్ ఖాన్ మూడో భాగం హిట్ అయితే మాత్రం మళ్ళి మనసు పారేసుకున్నా ఆశ్చర్యం లేదు . మరి పవన్ ఎటువైపు మొగ్గు చూపుతాడో వేచి చూడాలి.