Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ ఆ సినిమా పై మనసు పడ్డారా...?

By:  Tupaki Desk   |   11 Aug 2020 5:30 PM GMT
పవర్ స్టార్ ఆ సినిమా పై మనసు పడ్డారా...?
X
టాలీవుడ్‌ లో రీమేక్‌ ల హవా కొనసాగుతోంది. ఒక భాషలో హిట్టైన సినిమాను వేరే భాషలో రీమేక్ చేయడమనేది ఎప్పటి నుంచో వస్తున్నదే. ఆల్రెడీ సక్సెస్ అయిన సినిమా కావడంతో రిస్క్ ఉండదని నిర్మాతలు భావిస్తుంటారు. అందుకే ఇతర భాషల హిట్ సినిమాల రీమేక్ రైట్స్ కోసం పోటీ పడుతుంటారు. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇతర భాషల్లో హిట్టైన సినిమాలను తెలుగులో రీమేక్ చేయడానికి వెనుకాడడు. 'గోకులంలో సీత' 'సుస్వాగతం' 'తమ్ముడు' 'ఖుషీ' 'అన్నవరం' 'తీన్ మార్' 'గబ్బర్ సింగ్' 'కాటమరాయుడు' వంటి రీమేక్ చిత్రాల్లో నటించాడు పవన్ కళ్యాణ్.

అంతేకాకుండా లేటెస్టుగా పవన్ హిందీలో హిట్టైన 'పింక్‌' రిమేక్‌ చిత్రం ''వకీల్‌ సాబ్‌'' లో నటిస్తున్న విషయం తెలిసిందే. తన కెరీర్లో ఎక్కువ శాతం రీమేక్ సినిమాలనే నమ్ముకున్న పవన్‌ కల్యాణ్‌ 'డ్రైవింగ్ లైసెన్స్' అనే మలయాళ సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని.. రామ్ చరణ్ ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఇంతవరకు దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ క్రమంలో తాజాగా పవర్ స్టార్ మరో మలయాళ సినిమాపై మనసు పారేసుకున్నాడని న్యూస్ ఒకటి ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

కాగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్‌ కల్యాణ్‌ వరుస పెట్టి సినిమాలు ఓకే చేస్తున్నాడు. ఈ క్రమంలో 'వకీల్ సాబ్'తో పాటు క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా.. హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఓ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పవన్. ఇప్పుడు లేటెస్టుగా మలయాళ మూవీ 'అయ్యప్పనుమ్ కోసియుమ్' తెలుగు రీమేక్ లో నటించడానికి పవర్ స్టార్ ఆసక్తిగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. పృథ్వీరాజ్ - బిజూ మీనన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ ఏడాది ప్రారంభంలో విడుదలై ఘన విజయం సాధించిది. ఈ స్టోరీ తెలుగు ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అవుతుందని భావించిన హారిక అండ్ హాసిని మరియు సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమా రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నారు.

అయితే ఈ సినిమా రీమేక్ రైట్స్ కొని నాలుగు నెలలవుతున్నా ఇప్పటి వరకు తెలుగు రీమేక్ లో ఎవరు నటించబోతున్నారు.. ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు అనే దాని మీద క్లారిటీ రాలేదు. అయితే చివరికి రవితేజ - రానా లను ఫైనలైజ్ చేసారని అనుకున్నారు. ఐతే ఇటీవల సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత ఫ్రెండ్ అయిన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మలయాళ సినిమా గురించి పవన్ కళ్యాణ్ వద్ద ప్రస్తావించారని.. పవన్ ఈ సినిమాని చూసి ఇంప్రెస్ అయ్యాడని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.