Begin typing your search above and press return to search.

ఈ సినీ ప్రముఖుడి కొడుకుతో పూజా ప్రేమాయణం?

By:  Tupaki Desk   |   10 Feb 2020 9:40 AM GMT
ఈ సినీ ప్రముఖుడి కొడుకుతో పూజా ప్రేమాయణం?
X
సినీ ప్రముఖులు.. అందునా సక్సెస్ ఫుల్ అయిన వారు వేసే ప్రతి అడుగును చాలామంది గమనిస్తుంటారు. ఇవాల్టి రోజున ఏ విషయాన్ని దాచటం అంత తేలిక కాదు. తాను చేసే వరుస సినిమాల సక్సెస్ తో మాంచి ఊపు మీద ఉన్న పూజాహెగ్డేకు సంబంధించిన సంచలన వార్త ఒకటి షికారు చేస్తోంది. పలు సినిమాలతో బిజీగా ఉన్న ఆమె.. బాలీవుడ్ నటుడితో లవ్ ట్రాక్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు. రీల్ అరవింద.. రియల్ గా ప్రేమలో పడిపోయినట్లుగా బాలీవుడ్ వెబ్ సైట్లు చెబుతున్నాయి.

ఉత్తినే.. అలా ఏదో ఒకటి పుట్టించేస్తారన్న మాట అంటే.. ఆ అవసరం మాకేమిటంటూ.. ఇదిగో ఆధారాలు అని చూపిస్తున్నారు. వారు రిపోర్టు చేసిన దాని ప్రకారం తాజాగా.. ముంబయిలో జరిగిన లేట్ నైట్ పార్టీకి తన బాయ్ ఫ్రెండ్ తో పూజా హాజరైనట్లు చెబుతున్నారు. ఇంతకీ ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరంటే.. సీనియర్ స్టార్ వినోద్ మెహ్రా కుమారుడు రోహన్ మెహ్రాగా చెబుతున్నారు.
30 ఏళ్ల ఈ బాలీవుడ్ నటుడికి ఇప్పటికే పెళ్లైంది. అతడి కంటే ఏడాది చిన్నదైన పూజా నిజంగానే ప్రేమలో పడ్డారా?

అన్నదిప్పుడు క్వశ్చన్ గా మారింది. వీకెండ్ వేళ.. హర్షవర్ధన్ కపూర్ నిర్వహించిన ప్రైవేటు పార్టీకి రోహన్ తో కలిసి పైజా వెళ్లటం.. వారిద్దరూ ఒకే కారులో వచ్చి ఒకే కారులో వెళ్లటాన్ని ఆదారంగా చూపిస్తున్నారు. లేట్ నైట్ పార్టీకి వచ్చిన ఆమె.. తన బాయ్ ఫ్రెండ్ తో సంతోషం గా ఉన్నట్లుగా చెబుతున్నారు. మరి దీనిపై పూజా ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.