Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్: ప్రభాస్ త‌ప్పు దిద్దుకుంటున్నాడా?

By:  Tupaki Desk   |   28 March 2022 1:30 AM GMT
ట్రెండీ టాక్: ప్రభాస్ త‌ప్పు దిద్దుకుంటున్నాడా?
X
త‌ప్పులు చేయ‌డం మాన‌వ స‌హ‌జం. కానీ ఆ త‌ప్పుల్ని దిద్దుకున్న‌ప్పుడే తిరిగి కోలుకునే అవ‌కాశం ఉంటుంది. సాహో .. రాధేశ్యామ్ చిత్రాల‌తో ప్ర‌భాస్ కి కొన్ని అనుభవాల‌య్యాయ‌న్న‌ది వాస్తవం. భారీ బ‌డ్జెట్లు పెట్టించి కొత్త ద‌ర్శ‌కుల‌తో అత‌డు అసాధార‌ణ ప్ర‌యోగాలు చేశాడు. కానీ వ‌రుస‌గా రెండు వైఫ‌ల్యాలు క‌ల‌వ‌ర‌పరిచాయి.

అయితే ప్ర‌భాస్ అన్న పేరు చెబితేనే బాక్సాఫీస్ షేక్ అవుతుంద‌ని క‌లెక్ష‌న్లు నిరూపించాయి. సాహో హిందీ బెల్ట్ లో పెద్ద స‌క్సెస్ సాధించింది. రాధేశ్యామ్ కి పూర్తిగా నిరాశ‌ప‌రిచే రివ్యూలు రావ‌డంతో హిందీలోనూ ఆశించినంత‌గా జోరు చూపించ‌లేక‌పోయింది. ఏదైతేనేం.. ఇప్పుడు అన్ని త‌ప్పుల నుంచి నేర్చుకుని బ‌య‌ట‌కు రావాలి.

అయితే ప్ర‌భాస్ కి ఒక ధీమా ఉంది. తాను న‌టిస్తున్న వ‌రుస పాన్ ఇండియా చిత్రాల్లో ఒక్క‌టి బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టినా తిరిగి త‌న కెరీర్ కి ఎలాంటి డోఖా ఉండ‌దు. ఖాన్ ల‌కు అయినా ఇలాంటిది త‌ప్ప‌డం లేదు. ఇక అన్నిటి నుంచి బ‌య‌ట‌ప‌డి స‌త్తా చాట‌డ‌మే త‌న ముందున్న ధ్యేయం. ప్రభాస్ లైన‌ప్ ప‌రిశీలిస్తే మాస్ లో బాక్సాఫీస్ ధ‌మాకా మోగించే వ‌రుస చిత్రాలు మునుముందు రానున్నాయి.

కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తో స‌లార్ సంచ‌ల‌నాలు సృష్టించ‌నుంద‌ని ఇప్ప‌టికే అంచ‌నా ఉంది. అలాగే ఓం రౌత్ తో ఆదిపురుష్ 3డి మ‌రో లెవ‌ల్లో ఉంటుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. వీట‌న్నిటినీ కొట్టేలా నాగ్ అశ్విన్ తో భారీ సైన్స్ ఫిక్ష‌న్ ప్ర‌యోగం చేస్తున్నాడు. ఇది ఇండియా లెవ‌ల్లోనే కాదు వ‌ర‌ల్డ్ లెవ‌ల్లో మోత మోగిస్తుంద‌ని అంతా భావిస్తున్నారు. తాను అనుకున్నట్టే జ‌రిగితే గ‌నుక‌.. ప్ర‌భాస్ రేంజు మ‌రోసారి స్కైని ట‌చ్ చేయ‌డం ఖాయ‌మ‌ని అంతా భావిస్తున్నారు.

బాహుబ‌లి 1.. బాహుబ‌లి 2తో పాన్ ఇండియా స్టార్ గా త‌న‌ని తాను నిల‌బెట్టుకున్న ప్ర‌భాస్ కి ఇప్పుడు కాంపిటీష‌న్ అంత‌కంత‌కు పెరుగుతోంది. ఓవైపు బ‌న్ని పుష్ప‌తో పాన్ ఇండియా రేస్ లో స‌త్తా చాటాడు. పుష్ప 2తో దుమారం రేపుతాడ‌న్న అంచ‌నా ఉంది. ఇటు రామ్ చ‌ర‌ణ్‌.. ఎన్టీఆర్ లు ఆర్.ఆర్.ఆర్ తో పాన్ ఇండియా రేంజులో బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నం సృష్టించారు.

మునుముందు లైగ‌ర్ తో విజ‌య్ దేవ‌ర‌కొండ పాన్ ఇండియా రేస్ లో చేరుతున్నాడు. కాబట్టి ప్ర‌భాస్ మునుముందు త‌న ప్ర‌ణాళిక‌ల్ని ఇత‌ర హీరోల‌కు త‌గ్గ‌కుండా మ‌రింత బ‌లోపేతం చేస్తాడ‌నే అభిమానులు న‌మ్ముతున్నారు. బాలీవుడ్ లో వ‌య‌సు అయిపోత‌న్న ఖాన్ ల‌ను రీప్లేస్ చేసేందుకు తెలుగు స్టార్లు పోటీప‌డుతుండ‌డం నిజంగానే ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.