Begin typing your search above and press return to search.
ప్రభాస్ ఆ బిజినెస్ లోకి దిగుతున్నాడా?
By: Tupaki Desk | 14 July 2022 11:30 AM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఇటీవల ఆయన రాధే శ్యామ్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోవడంతో ఈసారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలనే కృతనిశ్చయంతో ఉన్నారు.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో సలార్, ప్రాజెక్ట్ కె, ఆదిపురుష్, స్పిరిట్ చిత్రాలు ఉన్నాయి. అలాగే మరికొన్ని చిత్రాలకు కూడా యంగ్ రెబల్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
సలార్ కు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ప్రాజెక్ట్ కెకు నాగ్ అశ్విన్, ఆది పురుష్ కు ఓం రౌత్, స్పిరిట్ కు వంగా సందీప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు, ఇవన్నీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి. దీంతో అంచనాలు కూడా అదే రేంజులో ఉన్నాయి.
కాగా మిగతా టాలీవుడ్ హీరోల్లానే ప్రభాస్ కూడా బిజినెస్ బాట పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రిన్స్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మల్టీప్లెక్సుల నిర్మాణంలో ఉన్నారు.
మహేష్ అయితే ఇప్పటికే ఏఎంబీ మాల్స్ పేరుతో అందరికంటే ముందున్నాడు. ఇక రామ్ చరణ్ ట్రూ జెట్ విమానయాన సంస్థలో భాగస్వామిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ కూడా వ్యాపార రంగంలోకి కాలుమోపుతున్నట్టు సమాచారం.
ప్రభాస్ మంచి భోజన ప్రియుడు కావడంతో ఆయన రెస్టారెంట్ల బిజినెస్ లోకి వస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. స్పెయిన్, దుబాయిల్లో హోటళ్లు నిర్మిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభాస్ టీమ్ రంగంలోకి దిగిందని.. హోటళ్ల నిర్మాణంపై కసరత్తు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఇక అంతా ఫైనల్ అయ్యాక అధికారికంగా వెల్లడిస్తారని పేర్కొంటున్నారు.