Begin typing your search above and press return to search.

ప్రభాస్, మారుతి సినిమా ఆగిపోయిందా?

By:  Tupaki Desk   |   18 Jan 2023 4:30 PM GMT
ప్రభాస్, మారుతి సినిమా ఆగిపోయిందా?
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. డివివి దానయ్య ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. హర్రర్ కామెడీ జోనర్ లో పాన్ ఇండియా లెవెల్ లో ఈ మూవీ తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా సౌత్ ఇండియన్ హాట్ బ్యూటీస్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో రిద్ది కుమార్ కూడా నటిస్తుంది. ఈ సినిమా కాన్సెప్ట్ ప్రకారం ఓ పురాతన భవనంలో కథ మొత్తం జరుగుతుందని తెలుస్తుంది.

దీనికోసమే మారుతి ప్రత్యేకంగా ఒక భారీ ఇంటి సెట్ ను కూడా నిర్మించారు. ఈ సెట్ లో ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ అయింది. అయితే తాజాగా ఈ సినిమాపై ఆసక్తికర రూమర్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.

ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఈ సినిమా కంప్లీట్ గా ఆగిపోయిందని ప్రచారం నడుస్తుంది. ప్రభాస్ డేట్స్ అడ్జస్ట్ చేయలేక సినిమాను పక్కన పెట్టినట్లు టాక్ తెరపైకి వచ్చింది. అయితే ఈ రూమర్స్ లో ఎలాంటి వాస్తవం లేదని మాట వినిపిస్తుంది. ప్రభాస్ ఈ సినిమా కోసం ఆల్రెడీ ప్రత్యేకంగా డేట్లు కేటాయించినట్లు సమాచారం.

సలార్, ప్రాజెక్ట్ కె, మారుతి సినిమాల కోసం తన కాల్ షీట్స్ ని ప్రాపర్ గా ప్లాన్ చేసుకున్నారని తెలుస్తుంది. త్వరలో ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ప్రారంభమవుతుందని సమాచారం. అలాగే ఈ ఏడాదిలోనే ఈ మూవీని కంప్లీట్ చేసి రిలీజ్ చేసేందుకు దర్శకుడు మారుతి ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. సినిమా ఆగిపోయిందనే ప్రచారం అవాస్తమని నిర్మాత కూడా క్లారిటీ ఇచ్చినట్లు ఫిలింనగర్ సర్కిల్ లో వినిపిస్తున్న మాట.

రాదేశ్యామ్ రిలీజ్ తర్వాత ప్రభాస్ కూడా ఈ హారర్ కామెడీ స్టోరీ తనకు బాగా నచ్చిందనే విషయం ఓ ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆటకెక్కిందని జరుగుతున్న ప్రచారం నిజం కాదనే మాట ప్రభాస్ సన్నిహితుల నుంచి కూడా వినిపిస్తుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.