Begin typing your search above and press return to search.

ప్రభుదేవా మరో పెళ్లికి రెడీ అయ్యాడా?

By:  Tupaki Desk   |   13 Nov 2020 8:50 AM GMT
ప్రభుదేవా మరో పెళ్లికి రెడీ అయ్యాడా?
X
నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ ఇలా సినీ రంగంలో విభిన్న పాత్రలను పోషిస్తూ సక్సెస్ సాధించిన ప్రభుదేవా సంసార జీవితం మాత్రం సాఫీగా సాగడం లేదని తమిళ మీడియా కోడై కూస్తోంది. ఇప్పటికే మూడు డేటింగ్ లు.. కొత్త పెళ్లితో ప్రభుదేవా జీవనం సాగబోతోందని తాజాగా రాసుకొస్తున్నాయి. తాజాగా మరో పెళ్లికి ప్రభుదేవా రెడీ అయ్యాడన్న వార్త మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

గత ఏడాది దబాంగ్ 3 ద్వారా ప్రభుదేవా బాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి నిరూపించుకున్నాడు. ప్రస్తుతం అదే సల్మాన్ ఖాన్ తో ‘రాధే’ అనే చిత్రం చేస్తున్నాడు.మరోవైపు నటుడిగా ‘బఘీరా’ అనే టైటిల్ తో తన 55వ చిత్రం చేస్తున్నాడు. అధిక రవిచంద్రన్ దర్శకుడు.

ప్రభుదేవా సినీ కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. అయితే ఆయన వ్యక్తిగత జీవతం మాత్రం ఒడిదుడుకులతో సాగుతోందట.. 1995లో ప్రభుదేవా రామలతను వివాహం చేసుకున్నాడు. ఆమెకు 2011లో విడాకులు ఇచ్చారు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు. స్టార్ హీరోయిన్ నయనతార వల్లనే వీరిద్దరూ విడిపోయారని.. నయనతారతో ప్రభుదేవ డేటింగ్ వల్ల వారి సంసారం చిన్నాభిన్నామైందని కోలీవుడ్ మీడియా కోడై కూసింది.

ఆ తర్వాత ఏమైందో కానీ నయనతారతోనూ ప్రభుదేవా బ్రేకప్ చెప్పాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఖాళీగా ఉంటున్న ప్రభుదేవా తన చుట్టాల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టు కోలీవుడ్ మీడియా తాజా సమాచారం. ఇద్దరూ పరస్పరం అర్థం చేసుకొని పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధం అయ్యారట.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కాగా తన మరో పెళ్లిపై ప్రభుదేవా మాత్రం అధికారికంగా స్పందించలేదు.