Begin typing your search above and press return to search.

పిసి తల్లి కాబోతోందా?

By:  Tupaki Desk   |   15 Feb 2019 11:26 AM GMT
పిసి తల్లి కాబోతోందా?
X
గత ఏడాది మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీ వెడ్డింగ్ గా నిలిచిన ప్రియాంకా చోప్రా నిక్ జోనాస్ ల పెళ్లి సంరంభం ఇంకా కళ్ళ ముందు మెదులుతూ ఉండగానే అభిమానులకు ఓ తీపి కబురు అందుతోంది. దాని ప్రకారం ప్రియాంకా తల్లి కాబోతోందట. ఇటీవలే తన హాలీవుడ్ మూవీ ఈజ్ ఇన్టిట్ రొమాంటిక్ కోసం ప్రమోషన్ లో పాల్గొంటున్న ప్రియాంకా చోప్రా కడుపు కాస్త ఉబ్బి ఉండటాన్ని గమనించిన ఇంగ్లీష్ మీడియా దాని గురించి ప్రస్తావిస్తూ అమ్మ కాబోయే అవకాశాలను ఉటంకిస్తూ కథనాలు వెలువరించింది.

అయితే ప్రియాంకా కాని నిక్ కాని దీని గురించి స్పందించడం ఖండించకపోవడం రెండూ చేయలేదు. ప్రియాంకా చోప్రాను కొద్దిరోజుల క్రితం ఓ ప్రతినిది ప్రశ్నించినప్పుడు తమకు వెంటనే తల్లితండ్రులయ్యే ఉద్దేశం లేదని టైం తీసుకుని ప్లాన్ చేసుకుంటామని చెప్పింది. అయితే నిక్ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. వీలైనంత త్వరగా తండ్రి కావాలని ఉందని వేరే ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇందులో ఏది నిజమో ఇప్పటికిప్పుడు చెప్పలేం కాని ఆ శుభ ఘడియలు దగ్గరలోనే ఉన్నట్టున్నాయి. ప్రియాంకా ఇప్పుడు ప్రమోట్ చేస్తున్న ఇంగ్లీష్ సినిమా కాకుండా మరొకటి కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.

వీటి ఫలితాలు చూసాకే కెరీర్ ప్లాన్ చేసుకోవాలని చూస్తున్న ప్రియాంకాకు ఇప్పట్లో హింది సినిమాలు చేసే ఆలోచన మాత్రం లేదు. సల్మాన్ ఖాన్ భరత్ ను ముందు ఒప్పుకుని తర్వాత తూచ్ అని చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడం పట్ల ఇప్పటికీ బాలీవుడ్ పెద్దలు తన మీద గుర్రుగా ఉన్నారు. ఒకవేళ హింది సినిమా చేయాల్సి వస్తే తన స్వంత ప్రొడక్షన్ మొదలుపెడతాను తప్ప ఇంకొకరిని అడగాల్సిన అవసరం లేదని పిసి చెప్పినట్టు సన్నిహితుల మాట. ఇదంతా సరే కాని పిసి తల్లి కాబోతోందా లేదా మహా అయితే ఇంకో నెల రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది