Begin typing your search above and press return to search.
ఛార్మీ సోలోగా ఉండిపోవడానికి పూరీనే కారణమా..?
By: Tupaki Desk | 19 Jun 2021 4:30 AM GMTసీనియర్ హీరోయిన్, ప్రొడ్యూసర్ ఛార్మి కౌర్ పెళ్లి విషయంపై ఎప్పుడూ ఏదొక వార్త వినిపిస్తూనే ఉండేది. మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ తో ప్రేమలో ఉందని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. ఇదే క్రమంలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో సన్నిహితంగా ఉండటం చూసి.. ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ రూమర్స్ పుట్టుకొచ్చాయి. ఇటీవల తన సమీప బంధువుని వివాహం చేసుకోనుందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఛార్మీ స్పందిస్తూ జీవితాంతం ఒంటరిగా ఉంటానని స్టేట్మెంట్ ఇచ్చి షాక్ ఇచ్చింది.
''ప్రస్తుతం నేను లైఫ్ లో బెస్ట్ సమయాన్ని గడుపుతున్నాను. నేను ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను. లైఫ్ లో పెళ్లి చేసుకోవడమనే తప్పును నేను ఎప్పడూ చేయను'' అని ఛార్మీ కుండ బద్దలు కొట్టింది. దీంతో ఛార్మీకి పెళ్లి పై ఇంతలా వ్యతిరేకత కలగడానికి కారణమేంటో అని అందరూ చర్చించుకున్నారు. అయితే ఛార్మీ సోలోగా ఉండిపోవడానికి పూరీ ఇన్ ఫ్ల్యూయెన్సే కారణమేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా పూరీ మ్యూజింగ్స్ లో ‘సింగిల్ బై ఛాయిస్’ పాడ్ కాస్ట్ విన్న ప్రతి ఒక్కరు కచ్చితంగా ఛార్మీ సోలోగా ఉండిపోవడానికి కారణం పూరీనే అని ఓ కొలిక్కి రాక మానరు.
పూరీ మాట్లాడుతూ సినిమా హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకుంటే తనకి నచ్చదని.. హీరోయిన్స్ దేవతలతో సమానమని.. కాబట్టి వాళ్లు కూడా దేవతల్లా ఆలోచించి.. తమ శక్తిని ఈ దేశాన్ని మార్చడానికి ఉపయోగించాలని సూచించారు. ''జయలలిత, మాయావతి, మమతాబెనర్జీ.. ఇలా ఎంతోమంది మహిళలు స్ఫూర్తి నింపడానికి ఉన్నారు. వాళ్లకు మగవాళ్లతో పనిలేదు. పురాణాల్లో కూడా సింగిల్ ఉమెన్స్ ఎంతోమంది ఉన్నారు. హాలీవుడ్ లో అయితే పెళ్లిని పక్కనపెట్టిన లేడీ సూపర్ స్టార్స్ కు కొదవే లేదు. రంభ ఊర్వశి మేనకలు పెళ్లి చేసుకోలేదు కాబట్టే స్వర్గంపై అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. హీరోయిన్స్ అందరూ నా మాట విని దేవతల్లా ఆలోచించండి'' అని పూరీ చెప్పారు.
''హీరోయిన్స్ మాత్రమే కాదు ధైర్యవంతురాలైన ప్రతి మహిళా దేవతలా మారాలి. మంగళసూత్రం మర్చిపోండి. నేను స్ట్రాంగ్ ఉమెన్ అని మీరు ఫీలైతే జీవితంలో సింగిల్ గా ఉండిపోండి. స్ట్రాంగ్ ఉమెన్ మాత్రమే ఈ దేశాన్ని మార్చగలరు'' అని పూరీ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ ఆడియో విన్న వాళ్ళు ఛార్మీ డెసిజన్ కి దీన్ని లింక్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం వీరు కలిసి చేస్తున్న 'లైగర్' సినిమాలో కూడా ఇలాంటి స్ట్రాంగ్ పాయింట్స్ తో కొన్ని మెసేజ్ లు జనాల మీదకి వదిలాడని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.