Begin typing your search above and press return to search.

#గుస‌గుస‌.. స్టార్ హీరోని పూరి లాక్ చేసిన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   2 Dec 2022 3:05 AM GMT
#గుస‌గుస‌.. స్టార్ హీరోని పూరి లాక్ చేసిన‌ట్టేనా?
X
'లైగర్' విష‌యంలో తానొక‌టి త‌లిస్తే అన్న‌చందంగా అయ్యింది. ఈ సినిమాతో పాన్ ఇండియా హిట్టు కొట్టాల‌ని పూరి ఎంతో క‌సిగా రెండేళ్లు పైగా విరామం అన్న‌దే లేకుండా శ్ర‌మించారు. కానీ చాలా ఆశించిన ఈ చిత్రం డిజాస్ట‌ర్ అవ్వడం పూరీ జగన్నాథ్ ని తీవ్రంగా నిరాశ‌ప‌రిచిన సంగ‌తి తెలిసిందే.

దీనికి తోడు ఈ సినిమా నిర్మాత‌ల‌పై మనీలాండరింగ్ కేసు నమోదవ్వ‌డం అద‌న‌పు ఇబ్బంది. పూరి-ఛార్మి స‌హా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను కూడా ఇటీవ‌ల‌ ఈడీ ప్రశ్నించింద‌ని క‌థ‌నాలొచ్చాయి. ప్ర‌స్తుతం పూరి కఠినమైన ద‌శ‌ను ఎదుర్కొంటున్నాడు.

తాజా స‌న్నివేశంలో ఏం జ‌రుగుతోందో అప్ డేట్ లేదు. అతడు తన తదుపరి సినిమా గురించి ఎలాంటి వివ‌రాల్ని ప్రకటించలేదు. పూరి త్వరలో తన కొడుకు ఆకాష్ పూరీని డైరెక్ట్ చేస్తాడని గుస‌గుస‌లు వినిపించాయి. కానీ దానిపై ఎలాంటి స‌మాచారం అంద‌లేదు. ఫిలింన‌గ‌ర గుస‌గుస‌ల ప్ర‌కారం... ఇప్పుడు ఓ ప్రాజెక్ట్ కోసం పూరీ మాస్ మ‌హారాజా రవితేజతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ని కూడా తెలిసింది.

గ‌తంలో రవితేజ- పూరి కాంబినేషన్ లో ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో 'నేనింతే' లాంటి అవార్డుల సినిమా కూడా ఉంది. ప్ర‌స్తుతం చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్న‌ ప్రాజెక్ట్ రానున్న రోజుల్లో కార్యరూపం దాల్చుతుందో లేదో వేచి చూడాలి.

మ‌రోవైపు రవితేజ వ‌రుస‌ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అత‌డి డైరీ మ‌రో రెండేళ్ల వ‌ర‌కూ ఖాళీగా లేద‌ని టాక్ వినిపిస్తోంది. అయితే త‌న కెరీర్ ఎదుగుద‌ల‌కు అవ‌స‌ర‌మైన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను అందించిన త‌న ఆప్త‌మిత్రుడు పూరి జ‌గ‌న్నాథ్ కోసం అత‌డు డేట్స్ కేటాయిస్తాడ‌నే అంతా ఊహిస్తున్నారు. ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి. కొన్నిటికి కాల‌మే స‌మాధానం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.