Begin typing your search above and press return to search.

టాలీవుడ్ నే ఆశ్చర్యపరుస్తున్న పూరి, దేవరకొండ

By:  Tupaki Desk   |   26 Feb 2020 9:00 AM GMT
టాలీవుడ్ నే ఆశ్చర్యపరుస్తున్న పూరి, దేవరకొండ
X
చిరంజీవి అయినా అమితాబ్ బచ్చన్ అయినా.. మహేష్ బాబు అయినా ప్రభాస్ అయినా సరే.. స్టార్ హోదాతో సంబంధం లేకుండా సినిమాను జెట్ స్పీడ్ తో పూర్తి చేయగల నేర్పరి మన టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్. అతడి కలం వేగం.. కథ కథనాలు వేగమే.. దర్శకత్వమూ వేగమే.. ఒక సినిమాను గరిష్టంగా పూర్తి చేయడానికి పూరి జగన్నాథ్ తీసుకున్న సమయం ఎంతో తెలుసా? కేవలం 90 రోజులు.. అంటే మూడు నెలలు. ఎంత పెద్ద సినిమా అయినా సరే ప్లానింగ్ తో 3 నెలల్లోనే పూర్తి చేస్తాడనే పేరుంది. పూరి జగన్నాథ్ తీసిన పెద్ద సినిమా పోకిరి. దీని కోసం ఏకంగా 90 రోజులు పనిచేశాడట.. అది ఎంత పెద్ద బ్లాక్ బస్టరో తెలిసిందే.

స్టార్ హీరోల సినిమానే 90రోజుల్లోపే చాపచుట్టేసే పూరి జగన్నాథ్ తన సహజ శైలికి భిన్నంగా ముందుకెళ్తుండడం టాలీవుడ్ ను ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా తీస్తున్నమూవీ విషయంలో పూరి ఏమాత్రం తొందరపడడం లేదట.. ఈ చిత్రం ఫ్లాపుల్లో ఉన్న విజయ్ తోపాటు విజయాలకు మొహం వాచి ఉన్న పూరికి కూడా అత్యంత అవసరమైన సినిమా.. పైగా ప్యాన్ ఇండియా మూవీ. హిందీలోనూ రిలీజ్ చేస్తున్నారు. కరణ్ జోహర్ నిర్మిస్తున్నారు. అందుకే తమ సత్తా నిరూపించుకునే గొప్ప అవకాశంగా దీన్ని పూరి భావిస్తున్నాడట.. అందుకే అద్భుత చిత్రంగా మలచడానికి పూరి జగన్నాథ్ ఈ సినిమా కోసం పకడ్బందీగా ముందుకెళ్తున్నాడట..

బాలీవుడ్, టాలీవుడ్ లోనే క్రేజీ ప్రాజెక్టుగా దీన్ని తీర్చిదిద్దడానికి ప్రతీ ఫ్రేమును జాగ్రత్తగా తీయడానికి పూరి ‘ఫైటర్’ సినిమా కోసం ఎక్కువ సమయం తీసుకుంటున్నట్టు సమాచారం.

పూరి జగన్నాథ్ నెలరోజుల్లో కథ రాసి..మూడు నెలల్లోపే సినిమా తీస్తాడు. కానీ విజయ్ దేవరకొండ తో సినిమా విషయం లో పూరి జగన్నాథ్ తొందర పడలేదు. స్క్రిప్ట్ కోసం బాగా కష్టపడ్డాడు. ఇక విజయ్ దేవరకొండ ను మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ కోసం థాయ్ లాండ్ పంపించాడు. తన సహజశైలికి భిన్నంగా ఈ సినిమా కోసం ఏకంగా 120 రోజులు షెడ్యూల్ ప్లాన్ చేశాడు. అంటే నాలుగు నెలలకు పైగా సినిమా కోసం కష్టపడుతాడన్నమాట.. జాగ్రత్తగా తీయడం కోసం పూరి తీసుకుంటున్న శ్రద్ధ చూసి ఇప్పుడే టాలీవుడ్ లో ఈ సినిమాపై ఆసక్తి పెరిగి పోతోంది. పూరి హిట్ కొట్టేయడం ఖాయమా అన్న అంచనాలు సాగుతున్నాయి. చూడాలి మరి పూరి శ్రద్ధ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో..