Begin typing your search above and press return to search.
'పుష్ప 2' మైత్రీవారికి తలనొప్పిగా మారిందా?
By: Tupaki Desk | 26 Dec 2022 2:28 PM GMTఈ మధ్య దేశ వ్యాప్తంగా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ ట్రెండ్ నడుస్తోంది. ప్రతీ స్టార్ హీరో తను నటించిన సినిమాని పాన్ ఇండియా వైడ్ గా.. అంతకు మించి పాన్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాల మేకర్స్ కి కండీషన్స్ పెడుతున్నారట. కారణం గత కొన్ని నెలలుగా భారతీయ సినీమా స్వరూపం సమూలంగా మారిపోయింది. మన సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వున్న మన తెలుగు వాళ్లతో పాటు విదేశీ ప్రియులు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద ప్రతీ క్రేజీ మూవీ వందల కోట్లు కలెక్ట్ చేస్తూ కాసుల వర్షం కురిపిస్తోంది.
అయితే ఇదంతా కంటెంట్ నచ్చిన సినిమాలకే జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నా కొన్ని సినిమాలకు ప్రమోషన్స్ ఖర్చులు కూడా తిరిగి రాకపోవడంతో నిర్మాతలు పాన్ ఇండియా రిలీజ్ అంటే భయపడుతున్నారట. ఈ ఏడాది కేజీఎఫ్ చాప్టర్ 2, RRR, కార్తికేయ 2, కాంతార వంటి సినిమాలు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్ లో విడుదలై రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టాయి. రీసెంట్ గా జపాన్ లో విడుదలైన RRR అక్కడ దాదాపుగా రూ. 24 కోట్ల వరకు రాబట్టింది.
ప్రమోషన్స్ కోసం భారీగానే ఖర్చు చేశారు. అయితే రికవరీ కూడా సినిమాకున్న క్రేజ్ కి తగ్గట్టుగా రావడంతో మేకర్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా వుంటే ఈ పాన్ ఇండియా రిలీజ్ ట్రెండ్ ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ వారికి పెద్ద తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది.
పాన్ ఇండియా వైడ్ గా తమ సినిమాలని రిలీజ్ చేయడానికి సిద్ధపడుతున్నా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అంటే మాత్రం కొంగారు పడుతున్నారట. కారణం భారీ స్థాయిలో కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందట. అంతే కాకుండా ఆ మొత్తం రిటర్న్ అవుతుందనే గ్యారెంటీ కనిపించకపోవడమే.
రీసెంట్ గా ఇదే సంస్థ 'పుష్ప' మూవీని రష్యాలో భారీ స్థాయిలో రిలీజ్ చేసింది. ఇందు కోసం రూ. 3 కోట్లకు మించి ఖర్చు చేసింది కూడా. రీసెంట్ గా విడుదలైన 'పుష్ప' రష్యాలో ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయింది. ఫలితంగా ప్రమోసన్స్ కోసం.. వగైరా వగైరా చేసిన ఖర్చు చేసిన రూ. 3 కోట్లు కూడా రాబట్టలేకపోయిందట. దీంతో మైత్రీ వారికి అది బిగ్ లాస్ అని చెబుతున్నారు. ఇలా రిలీజ్ చేయాలంటే ఇప్పుడు మైత్రీ వారు భయపడుతున్నారట.
'పుష్ప 2' ని కూడా నేరుగా రష్యాతో పాటు పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ చేయాలనే ఒత్తిడి మొదలైందట. ఇదే ఇప్పుడు మైత్రీ వారికి పెద్ద తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 'పుష్ప 2' షూటింగ్ దశలో వుంది. ఈ మూవీని వచ్చే ఏడాది ఎండింగ్ లో పాన్ వరల్డ్ మూవీగా భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని బన్నీ, సుకుమార్ భావిస్తున్నారు. ఈ ప్లాన్ ఇప్పడు మైత్రీ వారికి సంకటంగా మారిందని ఇన్ సైడ్ టాక్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.