Begin typing your search above and press return to search.
పుష్పరాజ్ అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్నాడా?
By: Tupaki Desk | 12 July 2022 1:30 PM GMTఅల్లు అర్జున్ - సుకుమార్ ల కలయికలో రూపొంది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి మూవీ 'పుష్ప ది రైజ్'. భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
హీరోగా బన్నీకి, దర్శకుడిగా సుకుమార్ కు పాన్ ఇండియా లెవెల్లో భారీ క్రేజ్ ని తెచ్చిపెట్టింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీలోని ప్రతీ డైలాగ్, దేవిశ్రీప్రసాద్ అందించిన సాంగ్స్ దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి.
సమంత స్పెషల్ సాంగ్, బన్నీ హుక్ స్టెప్స్, శ్రీవల్లి సాంగ్ లో బన్నీ సిగ్నేచర్ స్టెప్.. తగ్గేదేలే అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ చివరికి డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ లోనూ వైరల్ అయింది. అంతే కాకుండా మన క్రికెటర్లతో పాటు ఇతర దేశాలకు చెందిన వరల్డ్ క్లాస్ క్రికెటర్లు కూడా ఈ సినిమా పాటలకు స్టెప్పులేశారు. క్రికెట్ మైదానంలోనూ పుష్ప డైలాగ్, మేరిజమ్ లతో అదరగొట్టేశారు. అంతలా ఫస్ట్ పార్ట్ వైరల్ గా మారడంతో పార్ట్ 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
బాక్సాఫీస్ మార్కెట్ లెక్కలు కూడా మారిపోయాయి. దీంతో ఈ మూవీ బడ్జెట్ ని మేకర్స్ ఏకంగా డబుల్ చేసేశారు. 'పుష్ప 2'ని 350 కోట్ల బడ్జెట్ తో తెరపైకి తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఫైనల్ స్క్రిప్ట్ ని లాక్ చేసిన సుకుమార్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని స్టార్ట్ చేశారు. పార్ట్ వన్ లో డేట్స్ సమస్య కారణంగా మిస్సయిన విజయ్ సేతుపతి పార్ట్ 2 కోసం రంగంలోకి దిగుతున్నాడు. ఫహద్ ఫాజిల్ కూడా నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై బాలీవుడ్ లోనూ అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి.
ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ 'పుష్ప 2' కోసం భారీగా డిమాండ్ చేస్తున్నారంటూ వార్తలు వినిపించడం మొదలైంది. తాజాగా బన్నీ షాకింగ్ రెమ్యునరేషన్ ని పార్ట్ 2 కోసం డిమాండ్ చేస్తున్నారంటూ నెట్టింట ఓ వార్తల హల్ చల్ చేస్తోంది. బన్నీ ఈ మూవీ కోసం ఏకంగా 90 కోట్లు పారితోషికాన్ని డిమాండ్చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఫస్ట్ పార్ట్ కోసం 18 కోట్లు తీసుకున్న డైరెక్టర్ సుకుమార్ పార్ట్ 2 కోసం 45 నుంచి 50 కోట్లు డిమాండ్ చేస్తుండటంతో బన్నీ కూడా తన పారితోషికాన్ని 90 కోట్లకు పెంచేసినట్టుగా చెబుతున్నారు.