Begin typing your search above and press return to search.
బాహుబలి బాటలో పుష్పారాజ్ వెళ్తున్నాడా..??
By: Tupaki Desk | 24 April 2021 4:30 PM GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా తెరకెక్కుతుంది పుష్ప. అల్లు అర్జున్ కెరీర్ లోనే ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా పుష్ప రూపొందుతుంది. ఫుల్ లెన్త్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా రిలీజ్ చేశారు మేకర్స్. పుష్ప టీజర్ సినిమా పై ప్రేక్షకులలో అంచనాలు పెంచేసిందని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ వేషభాషలు పూర్తిగా కొత్తగా ఉన్నాయి. అంతేగాక చాలా రఫ్ అండ్ రియలిస్టిక్ గా సినిమా ఉండబోతుందని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియా తెగవైరల్ అవుతోంది.
ఏంటంటే.. పుష్ప సినిమాను కూడా రెండు భాగాలుగా విడుదల చేసే ఆలోచనలో సుకుమార్ బృందం ఉన్నట్లు టాక్. ఇప్పటికైతే పుష్ప సినిమా లెన్త్ మూడు గంటలకు పైగా ఉండటంతో సినిమాను బాహుబలిలా టు పార్ట్స్ చేస్తే బాగుటుందని అనుకుంటున్నారట. దీని ప్రకారంగా డైరెక్టర్ బృందం కూడా సినిమాను మరింత డెవలప్ చేసేందుకు కథను సిద్ధం చేసే పనిలో పడ్డారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి నిజమో కాదో తెలియదు కానీ ఒకవేళ పుష్ప సెకండ్ పార్ట్ తీయాలంటే మాత్రం బాహుబలిలా సాలిడ్ రీసన్ ఉంటేగాని సినిమా పై ఆసక్తి రాదు. అదిగాక సెకండ్ పార్ట్ వరకు వెళ్లాలంటే ముందుగా ఫస్ట్ పార్ట్ సినిమా పై ఇంటరెస్ట్ పెంచాలి. మరి మేకర్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే పెద్ద రిస్క్ తో కూడుకున్న పని. చూడాలి మరి కేజీఎఫ్, బాహుబలిలా పుష్ప కూడా రెండు భాగాలుగా వస్తుందేమో!