Begin typing your search above and press return to search.
అక్కడ పుష్పరాజ్ దుకాణం సర్దేశాడా?
By: Tupaki Desk | 23 Dec 2022 8:36 AM GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సపాన్ ఇండియా మూవీ 'పుష్ప'. లెక్కల మాస్టారు లెక్కలు వేసుకుని మరీ ఏడాది క్రితం హడావిడిగా రిలీజ్ చేసిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బన్నీ నటించిన సినిమాల్లో అత్యధిక వసూళ్లని రాబట్టిన తొలి సినిమాగా రికార్డు సాధించింది.
ఉత్తరాదిలోనూ సత్తా చాటి అక్కడ కూడా వంద కోట్లకు పైనే రాబట్ట ట్రేడ్ వర్గాలు అవాక్కయ్యేలా చేసింది. అయితే ముందస్తు ప్లాన్ తో భారీ స్థాయిలో ఉత్తరాదిలోనూ ప్రమోట్ చేసి వుంటే 'పుష్ప' వసూళ్ల ఫిగర్ మరోలా వుండేది.
సినిమావిడుదలై ఏడాది కావస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఐదు భాషల్లో భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ మూవీతో ఇంటర్నేషనల్ గా మరింత గుర్తింపుని సొంతం చేసుకోవాలనే ఆలోచనలో భాగంగా మేకర్స్ ఈ మూవీని డిసెంబర్ 8న భారీ స్థాయిలో రష్యాలో విడుదల చేశారు. సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర బృందం రష్యా రాజధాని మాస్కోలో భారీ స్థాయిలో ప్రమోషన్స్ ని నిర్వహించింది. అక్కడ మీడియాలో పలు డిబేట్ లలో పాల్గొంది.
దీంతో రష్యా వాసుల్లో సినిమాపై భారీ క్రేజ్ మొదలైంది. ఫుష్ప' పాపులర్ డైలాగ్ లని అక్కడి ప్రేక్షకులు చెప్పడం, రీల్స్ చేయడం చేశారు. అక్కడ ఆ క్రేజ్ ని చూసి పుష్ప రాజ్ రష్యా బాక్సాఫీస్ ని రఫ్పాడించడం ఖాయం అనుకున్నారంతా.
మేకర్స్ కూడా అక్కడ ప్రమోషన్స్ కోసం ఏకంగా మూడు కోట్ల వరకు ఖర్చు చేశారట. అయితే ఇంతగా ప్రమోషన్స్ ని నిర్వహించినా రష్యన్ లు పుష్పరాజ్ ని చూడటానికి ఆసక్తిని చూపించలేదని తెలుస్తోంది.
తాజా పరిణామాల నేఫథ్యంలో రష్యాలో పుష్పరాజ్ దుకాణం సర్దేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇది మేకర్స్ కి బిగ్ సాక్ గా చెబుతున్నారు. మరో విషయం ఏంటంటే ఈ మూవీ ప్రమోషన్స్ కోసం మేకర్స్ ఖర్చు చేసిన 3 కోట్లని కూడా ఈ సినిమా రాబట్టలేక అక్కడ చేతులెత్తేసిందట. దీంతో ప్రమోషన్స్ ఖర్చు కూడా మేకర్స్ కి రాలేదని పలువురు వాపోతున్నారు. 'RRR' ఆస్కార్ కు నామినేషన్ ని సాధించిన వేళ బన్నీ 'పుష్ప'కు ఇలాంటి పరాభవం దక్కడంతో టీమ్ అంతా షాక్ లో వున్నారట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.