Begin typing your search above and press return to search.
వెంకీ మామ... ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్
By: Tupaki Desk | 24 Aug 2019 9:21 AM GMTవిక్టరీ వెంకటేష్.. అక్కినేని నాగచైతన్య కలిసి నటిస్తున్న మల్టిస్టారర్ చిత్రం 'వెంకీమామ'. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకీకి జోడీగా పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా.. చైతుకు జోడీగా రాశి ఖన్నా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుండి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ సినిమాలో రాశి ఖన్నా ఒక స్కూల్ టీచర్ పాత్రలో నటిస్తోందట. ఇప్పటికే రాశి పాత్రకు సంబంధించిన కొన్ని ఆన్ లొకేషన్ స్టిల్స్ బయటకు వచ్చాయి. తాజాగా రాశి వెంకటేష్ ఇద్దరూ కలిసి ఉన్న మరో ఫోటో కూడా బయటకు వచ్చింది. ఈ ఫోటోలో వెంకీ తనదైన స్టైల్ లో నిలబడి ఉండగా రాశి ఖన్నా లంగా ఓణి ధరించి పూర్తి ట్రెడిషనల్ గా ఉంది. వెంకీని ప్రేమగా హగ్ చేసుకుంటూ ఫోటోకు పోజిచ్చింది.
ఈ సినిమాలో వెంకటేష్ - నాగ చైతన్య మామ అల్లుళ్లుగా నటిస్తున్నారు. వెంకీ పాత్ర గురించి ఎక్కువగా వివరాలు లేవు కానీ చైతు మాత్రం ఒక మిలిటరీ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడని సమాచారం. మరి రియల్ లైఫ్ మామ - మేనల్లుడు రీల్ లైఫ్ లో అవే పాత్రల్లో ఎలాంటి అల్లరి చేస్తారో చూడాలంటే సినిమా విడుదల అయ్యేవరకూ వేచి చూడాల్సిందే.