Begin typing your search above and press return to search.
రాజ్ తరుణ్ తో డీల్ కుదిరినట్టుందే
By: Tupaki Desk | 22 May 2019 7:22 AM GMTగత ఏడాది వరసగా మూడు డిజాస్టర్లతో షాక్ తిన్న కుర్ర హీరో రాజ్ తరుణ్ మెల్లగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే ఏడాది పైగా గ్యాప్ తీసుకున్న తరుణంలో ప్రస్తుతం చేస్తున్న ఇద్దరి లోకం ఒకటేతో పాటు మరో కొత్త సినిమా కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. నితిన్ తో గుండె జారీ గల్లంతయ్యిందేతో డెబ్యూతోనే సూపర్ హిట్ కొట్టి నాగ చైతన్యతో ఒక లైలా కోసం తీసిన విజయ్ కుమార్ కొండా చెప్పిన లైన్ ఓకే అయినట్టుగా సమాచారం.
ఇదే కథను నితిన్ కు వినిపించిన కొండా గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆలస్యం కావడంతో రాజ్ తరుణ్ వైపు వచ్చేశాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒక లైలా కోసం ఫ్లాప్ తర్వాత విజయ్ కుమార్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో ఏదో వ్యక్తిగత కారణాల వల్ల ఓ వివాదంలో చిక్కుకుని ఆ తర్వాత బయటపడినట్టే ఉన్నాడు
ఇప్పుడు రాజ్ తరుణ్ తో చేయబోయేది కూడా లవ్ స్టోరీనే అని టాక్. తనకన్నా వయసులో పెద్దయిన అమ్మాయితో ప్రేమలో పడే యువకుడిగా రాజ్ తరుణ్ కనిపిస్తాడని న్యూస్ ఉంది. హీరోయిన్ గా నిత్య మీనన్ పేరు పరిశీలనలో ఉన్నట్టు కూడా తెలిసింది. ఇదంతా అఫీషియల్ అప్ డేట్ వచ్చాకే ఖరారు అవుతుంది కానీ అప్పటిదాకా ఫాన్స్ వేచి చూడక తప్పదు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో ఇద్దరి లోకం ఒకటే చేస్తున్న రాజ్ తరుణ్ అది పూర్తయ్యే లోపు దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది