Begin typing your search above and press return to search.

రాజమౌళి ఆ ట్విస్ట్ ఇస్తాడా?

By:  Tupaki Desk   |   28 Dec 2018 7:13 AM GMT
రాజమౌళి ఆ ట్విస్ట్ ఇస్తాడా?
X
నవంబర్ లో లాంచ్ చేసిన ఎస్ ఎస్ రాజమౌళి తాజా చిత్రం #RRR మొదటి షెడ్యూల్ డిసెంబర్ లో పూర్తయింది. ప్రస్తుతం బ్రేక్ తీసుకుంటున్న #RRR టీమ్ సంక్రాంతి పండగ తర్వాత రెండో షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొంటారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి ఒక పెద్ద ట్విస్ట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడని ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా కథ పునర్జన్మల నేపథ్యంలో ఉంటుందని 1930 ల కాలం నుండి నుండి ప్రారంభమై 2018 -19 వరకూ కొనసాగుతుందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఫైనల్ స్క్రిప్ట్ ఇంకా లాక్ చేయలేదని కూడా కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న టాక్ ఏంటంటే ఈ కథను రెండు భాగాలుగా తెరకెక్కించే స్కోప్ ఉందని రాజమౌళి భావిస్తున్నాడట. 'బాహుబలి' ని కూడా మొదట ఒక భాగంగా అనుకున్నప్పటికీ తర్వాత బడ్జెట్ లెక్కలలాంటివి బేరీజు వేసుకొని రెండు భాగాలుగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దానివల్ల సినిమా స్కేల్ కూడా భారీ గా పెరిగింది. మొదటి భాగం కంటే రెండో భాగమే నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు రాజమౌళి అదే ఫార్ములా ను దీనికి అప్లై చేసేందుకు రెడీ అవుతున్నాడట.

బాహుబలి స్టైల్లోనే మొదటి భాగాన్ని కొన్ని సమాధానాలు ఇవ్వకుండా వదిలేసి సెకండ్ పార్ట్ లో వాటిని చూపించేలా స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్నాడట. ఒక వేళ ఇదే నిజం అయితే ఫ్యాన్స్ అందరూ మరో 'బాహుబలి' రేంజ్ సినిమాకు ఫిక్స్ అయిపోవచ్చు. ఇక ఈ విషయం నిజమో కాదో క్లారిటీ ఇవ్వాల్సిందే మాత్రం జక్కన్నే.