Begin typing your search above and press return to search.

'పుష్ప 2' ఆల‌స్యానికి రాజ‌మౌళినే కార‌ణ‌మా..?

By:  Tupaki Desk   |   5 April 2022 7:30 AM GMT
పుష్ప 2 ఆల‌స్యానికి రాజ‌మౌళినే కార‌ణ‌మా..?
X
క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న పాన్ ఇండియా చిత్రం 'పుష్ప ది రైజ్‌'. ర‌ష్మిక మంద‌న్నా ఇందులో హీరోయిన్‌గా న‌టించ‌గా.. సునీల్‌, ఫహాద్‌ ఫాజిల్ విల‌న్లుగా చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా బ్యాన‌ర్ల‌పై నవీన్ యెర్నేని వై. రవి శంకర్ క‌లిసి నిర్మించిన ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు అందించారు.

ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ప‌క్కా మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ మూవీ గ‌త ఏడాది డిసెంబ‌ర్ 16న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుద‌లైంది. ఎర్రచందనం సిండికేట్ లోని ఒక‌ కూలీ ఆ వ్యాపరంలో డాన్ గా ఎలా ఎదిగాడనేదే ఈ సినిమా కథ. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న‌ప్ప‌టికీ.. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టి సూప‌ర్ హిట్‌గా నిలిచింది.

అయితే ఇప్పుడు 'పుష్ప ది రైజ్' కు కొన‌సాగింపుగా పార్ట్ 2 'పుష్ప ది రూల్‌' రాబోతోంది. ఏప్రిల్ నుంచి ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్తుంద‌ని మొద‌ట ప్ర‌చారం జ‌రిగింది. కానీ, పుష్ప‌ టీం షూటింగ్ ప్లాన్ ను మార్చేసింద‌ట‌. ఏప్రిల్ నుంచి కాకుండా జూన్ మొద‌టి వారంలో సెకెండ్ పార్ట్ రెగ్యుల‌ర్ షూట్ షురూ చేయాల‌ని భావిస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే ఉన్న‌ట్లుండి పుష్ప షూట్‌ను డిలే చేయ‌డం వెన‌క‌ కారణమేంటి అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మార‌గా.. ఓ ఇంట్ర‌స్టింగ్ టాక్ నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది. అదేంటంటే.. రాజ‌మౌళి కార‌ణంగానే పుష్ప 2 ఆల‌స్యం అవుతుంద‌ట‌. ఈయ‌న తెర‌కెక్కించిన 'ఆర్ఆర్ఆర్‌' ఇటీవ‌లె విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌తి సన్నివేశంలోనూ, ప్రతి పాటలోనూ, ప్రతి ఫైట్‌లోనూ రాజమౌళి పెర్ఫెక్ష‌న్ స్ప‌ష్టంగా క‌నిపించింది. విజువ‌ల్స్‌, యాక్ష‌న్ స‌న్నివేశాలు, హీరోల ఎంట్రీ ఇందులో హైలైట్‌గా నిలిచాయి.

ఇక ఇప్పుడు ఈ సినిమా 'పుష్ప 2'కు పెద్ద స‌వాల్‌గా మారింది. ఈ నేప‌థ్యంలోనే సుకుమార్ పార్ట్ 2 స్క్రిప్ట్ కు మరింత మెరుగులు దిద్దే పనిలో ప‌డ్డార‌ట‌. బన్నీ హీరోయిజం, ఊహించిన ట్విస్ట్ లు, అదిరిపోయే యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో పుష్ప ది రూల్ ను పీక్స్ కు తీసుకెళ్లాల‌ని భావిస్తున్నార‌ట‌. అందుకే హ‌డావుడి లేకుండా సినిమాను రూపొందించాల‌ని ఫిక్స్ అయిన‌ట్లు టాక్ న‌డుస్తోంది.