Begin typing your search above and press return to search.

అస‌లే కోవిడ్! 70 వ‌య‌సులో ర‌జ‌నీ సాహ‌సాలేమిటో?

By:  Tupaki Desk   |   27 April 2021 2:40 PM
అస‌లే కోవిడ్! 70 వ‌య‌సులో ర‌జ‌నీ సాహ‌సాలేమిటో?
X
ఓవైపు క‌రోనా మ‌హ‌మ్మారీ సెకండ్ వేవ్ ప్ర‌భావంతో ప్ర‌ధాన మెట్రో న‌గ‌రాలు స‌హా చాలా చోట్ల కంటైన్ మెంట్ జోన్లు ఏర్ప‌డుతున్నాయి. దీంతో ప్ర‌జ‌ల‌కు రిస్ట్రిక్ష‌న్స్ పెరిగాయి. కానీ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హైదరాబాద్ లోని ఐకియా స్టోర్ వ‌ద్ద ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. 70 వ‌య‌సులో ఆయ‌న సాహసం ప్ర‌స్తుతం అభిమానుల్లో చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఇంత‌కీ ఆయ‌న ఈ సాహ‌సం ఎందుకోసం? అంటే..

ఇదంతా అన్నాథే షూటింగ్ కోసం. ఇప్ప‌టికే ఈ సినిమా చిత్రీక‌ర‌ణ కోవిడ్ వ‌ల్ల ఆల‌స్య‌మ‌వుతూ వ‌స్తోంది. కానీ ఈసారి తెగించి షూట్ మొత్తం పూర్తి చేసేయాల‌ని ర‌జ‌నీ స‌హా ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప్లాన్ చేశార‌ని అర్థ‌మ‌వుతోంది. పైగా న‌గ‌రం న‌డిబొడ్డున విజువ‌ల్ రిచ్ లొకేష‌న్ అయిన‌ ఐకియా వంటి చోట్ల సీన్స్ ని తెర‌కెక్కించాల్సి ఉండ‌గా.. అక్క‌డ చిత్రీక‌ర‌ణకు వెన‌కాడ‌లేదు. గత కొన్ని వారాలుగా ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈరోజు నగరంలోని ఐకియా స్టోర్ వద్ద కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఐకియా స్టోర్ వద్ద జరిగే షూటింగ్ లో పాల్గొంటున్నారు.

అలాగే ర‌జ‌నీతో పాటు స‌న్నివేశాల్లో పాల్గొనేందుకు క‌థానాయిక న‌య‌న‌తార నేడు హైద‌రాబాద్ కి విచ్చేశారు. ఇంత‌కుముందే న‌య‌న్ విమానాశ్ర‌యంలో దిగిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. రేప‌టి నుంచి త‌ను సెట్స్ లో జాయిన‌వుతార‌ని స‌మాచారం. ఈ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ లో అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని హైలైట్ గా చూపించ‌నున్నార‌ని తెలుస్తోంది.

సన్ పిక్చర్స్ ప‌తాకంపై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మీనా- ఖుష్బూ- కీర్తి సురేష్- జగపతి బాబు- ప్రకాష్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు.