Begin typing your search above and press return to search.
`సాహో`కి తొలి రివ్యూ చరణ్ ఇస్తారా?
By: Tupaki Desk | 29 Aug 2019 11:03 AM GMTఇండియాస్ మోస్ట్ అవైటెడ్ `సాహో` చిత్రానికి థియేటర్లలో మొట్ట మొదటి ఆడియెన్ ఎవరు? అంటే .. అందుకు స్పష్ఠత వచ్చేసింది. చిత్రబృందం కాకుండా .. సీబీఎఫ్ సీ వర్గాలు ఇప్పటికే సినిమాని చూసేశారు. 2గం.ల 51 నిమిషాల షో ఇది. సెన్సార్ యుఏ సర్టిఫికెట్ ని జారీ చేసిన సంగతి తెలిసిందే. దేశ విదేశాల్లోని ప్రముఖ క్రిటిక్స్ ఇప్పటికే `సాహో` సినిమాని చూసి ట్వీట్ రివ్యూలు ఇచ్చారు. అలాగే సోషల్ మీడియాలో పలువురు పంపిణీదారులు సైతం మినీ రివ్యూలు ఇవ్వడం చూస్తున్నదే. అయితే ఈ రివ్యూలు వేటినీ ప్రభాస్ అభిమానులు విశ్వసించడం లేదు.
అయితే అభిమానులు నమ్మే రివ్యూ ఎవరు ఇస్తారు? అంటే ప్రభాస్ స్నేహితుడు మగధీరుడు రామ్ చరణ్ రివ్యూ ఇస్తాడనే భావిస్తున్నారంతా. నేడు నెల్లూరు - సూళ్లూరుపేటలో ప్రభాస్ వీఎపిక్ థియేటర్ ప్రారంబోత్సవానికి ముఖ్య అతిధిగా ఎటెండ్ అవుతున్న రామ్ చరణ్ ఆ థియేటర్ లో `సాహో` చిత్రాన్ని వీక్షించడానికి ఏర్పాట్లు చేశారట.
కొద్ది క్షణాల ముందే .. చరణ్ `సాహో` స్పెషల్ స్క్రీనింగ్ కి బయల్దేరారని సమాచారం. చరణ్ తో పాటుగా కొందరు ప్రముఖులు ఈ లాంచింగ్ వేడుకకు బయల్దేరారు. అయితే `సాహో` సినిమా చూసిన అనంతరం సూళ్లూరుపేట మీడియా మగధీరుడి వెంట పడడం ఖాయం. అక్కడే చరణ్ తొలి ఆడియెన్ గా `సాహో` రివ్యూ చెబుతారా? అన్నది ఆసక్తిగా మారింది. ఇక రేపటి నుంచి కామన్ ఆడియెన్.. అభిమానులు `సాహో` చిత్రాన్ని ఈ థియేటర్ లో వీక్షించనున్నారు. ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్ ఉన్న చిత్రమిది. 600 మంది ఒకేసారి వీఎపిక్ స్క్రీన్ లో సినిమాని వీక్షించే సౌలభ్యం ఉంది. నేటి రాత్రి 10గంటల(8.30 పీఎం అక్కడ)కు దుబాయ్ లో తొలి ప్రీమియర్ వేస్తున్నారు. అక్కడి నుంచి మిడ్ నైట్ కే రివ్యూలు వచ్చేస్తాయి. ఒంటి గంట నుంచి తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్లు వేస్తున్నారు. అంటే తెల్లారే సరికి సమీక్షలన్నీ రెడీగా ఉంటాయి. వీళ్లందరి కంటే ముందే చరణ్ రివ్యూ ఏమిటో చూడాలి.