Begin typing your search above and press return to search.
సూరిపై చరణ్ గుస్సా ?
By: Tupaki Desk | 13 Jun 2018 10:12 AM GMTహీరోగా కేవలం 10 సినిమాల అనుభవమే ఉన్నా నిర్మాతగా తన తొలి అడుగును ఖైదీ నెంబర్ 150తో విజయవంతంగా పూర్తి చేసిన రామ్ చరణ్ తన రెండో సినిమాను నాన్న చిరంజీవి హీరోగా అత్యధిక బడ్జెట్ తో సైరా తీస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ ఆశించిన స్పీడ్ లో జరగడం లేదు. ఇప్పుడో సీన్ అప్పుడో సీన్ అన్నట్టు మెల్లగా సాగిస్తున్నారు. నిజానికి సైరాను వచ్చే సంక్రాంతి బరిలో నిలపాలి అనేది చరణ్ ప్లాన్. కానీ జరుగుతున్న పరిణామాలు దానికి ఏ మాత్రం అనుకూలంగా లేవు. ఇప్పటిదాకా సంగీత దర్శకుడు కూడా డిసైడ్ కాలేదు. బహుశా చిరు కెరీర్ లో షూటింగ్ మొదలైన ఇంత కాలానికి కూడా మ్యూజిక్ డైరెక్టర్ ని డిసైడ్ చేయలేకపోవడం ఇదే మొదటి సారి కావొచ్చు. దీనికి కారణం దర్శకుడు సురేందర్ రెడ్డి అని అందువల్లే చరణ్ సూరిపై కాస్త గుర్రుగా ఉన్నాడని ఇన్ సైడ్ టాక్. కనీసం సగం కూడా ఇప్పటి దాకా పూర్తి కాలేదు. కంప్యూటర్ గ్రాఫిక్ వర్క్ చాలా ఉన్న నేపథ్యంలో ఎంత లేదన్నా పోస్ట్ ప్రొడక్షన్ కోసం కనీసం ఐదారు నెలలు కావాల్సి ఉంటుంది. అది షూటింగ్ పూర్తయితేనే సాధ్యం.
ప్రత్యేకంగా హాలీవుడ్ నిపుణులను పిలిపించి వార్ కి సంబంధించిన కీలకమైన ఎపిసోడ్స్ షూట్ చేస్తున్న సురేందర్ రెడ్డి డెడ్ లైన్ మాత్రం చెప్పలేకపోతున్నాడట. ధృవ టైంలో సూరి మేకింగ్ కి ఫిదా అయిపోయిన రామ్ చరణ్ అందరూ రిస్క్ అని వారించినా లెక్క చేయకుండా సైరాను సూరి చేతిలోనే పెట్టాడు. మొదలుకావడమే చాలా ఆలస్యంగా జరిగిన సైరా ఇప్పుడైనా స్పీడ్ అందుకుంటుందా అంటే ఆ సూచనలు కూడా లేవట.సైరా ప్రీ ప్రొడక్షన్ సమయంలోనూ రంగస్థలం షూటింగ్ వల్ల చరణ్ భారం మొత్తం అక్క సుస్మితతో పాటు సూరి మీదే పెట్టేసాడు. కానీ జాప్యం మరీ ఎక్కువైపోయింది . దీని ప్రభావం సహజంగానే బడ్జెట్ మీద పడుతుంది కాబట్టి ప్రొడక్షన్ కంట్రోల్ తప్పిందని చరణ్ సురేందర్ రెడ్డితో అన్నట్టు వినికిడి. అనుకున్న టార్గెట్ లో విడుదల చేయలేమనే నిస్సహాయత తో పాటు వ్యయం పెరుగుతూ పోవడం ఏ నిర్మాతకైనా కలిగించే విషయమే. అందులోనూ 200 కోట్ల దాకా బడ్జెట్ తో నిర్మాతగా ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న చరణ్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.