Begin typing your search above and press return to search.
ఆదిపురుష్ కు రామసేతు పోటీనా?
By: Tupaki Desk | 15 Nov 2020 11:10 AM GMTదీపావళి సందర్బంగా బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నుండి 'రామ్ సేత్' మూవీ ఫస్ట్ లుక్ వచ్చింది. ఈ సినిమా రామాయణం బ్యాక్ డ్రాప్ అని తెలియజేసేందుకు బ్యాక్ డ్రాప్ లో రాముడి ఫొటో కూడా ఉంది. రామాయణం టచ్ తోనే ఈ జనరేషన్ కు సంబంధించిన కథను ఈ సినిమాలో చూపించే అవకాశం ఉందని ఫస్ట్ లుక్ ను చూస్తుంటే అనిపిస్తుంది. ఇదే సమయంలో ప్రభాస్ హీరోగా హిందీలో ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది.
ఈ సమయంలో మరో రామాయణ నేపథ్య మూవీ రాబోతున్న నేపథ్యంలో అంతా కూడా ఈ రెండు సినిమాల మద్య పోటీ ఉంటుందని భావిస్తున్నారు. కాని ఈ రెండు సినిమాలు కూడా పూర్తి విభిన్నమైన సినిమాలు అంటూ బాలీవుడ్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాముడు లంక వెళ్లేందుకు వానరులు నిర్మించిన రామసేతు నేపథ్యంలో అక్షయ్ కుమార్ సినిమా ఉంటే చెడు పై మంచి సాధించే విజయంను ఆదిపురుష్ సినిమాలో చూపించబోతున్నారు.
రెండు సినిమాలు అటు ఇటుగా 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయినా కూడా రెండు సినిమాలకు పోటీ అనేది ఉండక పోవచ్చు అంటున్నారు. రామ్ సేత్ కు కేవలం ఉత్తరాదిలో మాత్రమే క్రేజ్ ఉంటుంది. కాని ఆదిపురుష్ కు మాత్రం సౌత్ లో కూడా విరీతమైన క్రేజ్ ఉంది. కనుక ఖచ్చితంగా రెండు సినిమాలు వేటికి అవే అన్నట్లుగా వసూళ్ల విషయంలో కూడా పోటీ పడే అవకాశం ఉండదని అంటున్నారు.