Begin typing your search above and press return to search.
మహేష్ కోసం ఆ నటిని ఫైనల్ చేశారా?
By: Tupaki Desk | 19 Sep 2022 7:41 AM GMTఈ మధ్య స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల కోసం సీనియర్ హీరోయిన్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30 వ ప్రాజెక్ట్ కోసం లేడీ సూపర్ స్టార్ విజయ శాంతిని అనుకుంటున్నారంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా వుంటే సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ కోసం కూడా సీనియర్ హీరోయిన్ ని ఫైనల్ చేసుకున్నారని తెలుస్తోంది. మహేష్ ప్రస్తుతం #SSMB28 పేరుతో త్రివిక్రమ్ డైరెక్షన్ లో రూపొందుతున్న భారీ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.
పుష్కర కాలం తరువాత మహేష్, త్రివిక్రమ్ కలిసి వర్క్ చేస్తున్న మూవీ కావడంతో ఈ ప్రాజెక్ట్ ని అంతా ప్రత్యేకంగా చూస్తున్నారు. గత సోమవారం సెప్టెంబర్ 12న అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించారు. భారీ యాక్షన్ ఎపిసోడ్ నేపథ్యంలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించడం విశేషం. తమిళ పాపులర్ ఫైట్ మాస్టర్స్ అన్బు - అరివు ఈ మూవీకి యాక్షన్ ఘట్టాలని కంపోజ్ చేస్తున్నారు.
మూడు రోజులు అన్నపూర్ణ స్టూడియోస్ లో షూట్ చేసిన త్రివిక్రమ్ టీమ్ ని రామోజీ ఫిల్మ్ సిటీకి మార్చేశాడు. ఆదివారం నుంచి కీలక ఘట్టాల షూటింగ్ ని మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది. దాదాపు నెల రోజుల పాటు ఈ యాక్షన్ ఘట్టాలకు సంబంధించిన లాంగ్ షెడ్యూల్ జరుగుతుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ మూవీకి ప్రధాన హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి తాజాగా బయటికి వచ్చేసింది.
త్రివిక్రమ్ ఈ మధ్య తన సినిమాల్లోని కీలక పాత్రల కోసం సీనియర్ హీరోయిన్ లని ఫైనల్ చేస్తుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. అత్తారింటికి దారేది' కోసం నదియాని, అజ్ఞాతవాసి కోసం ఖుష్బూని, 'అల వైకుంఠపురములో' కోసం టబుని ప్రత్యేక పాత్రల కోసం ఎంపిక చేసుకుని తన ప్రత్యేకతను చాటుకున్న విషయం తెలిసిందే. మహేష్ తో చేస్తున్న #SSMB28 కోసం కూడా అదే స్థాయిలో సీరియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ని రంగంలోకి దించేస్తున్నారట.
గతంలో 'నాని' మూవీ కోసం మహేష్ తో రమ్యకృష్ణ ప్రత్యేక రొమాంటిక్ సాంగ్ లో నటించిన విషయం తెలిసిందే. మళ్లీ ఇన్నేళ్లకు మహేష్ తో కలిసి రమ్యకృష్ణ నటించనుందని తెలియడంతో అంతా పాత్ర ఏంటీ? అని ఆరా తీయడం మొదలు పెట్టారు.
అయితే రమ్యకృష్ణ ఈ మూవీలో మహేష్ కు అత్తగా కనిపించనుందని తెలుస్తోంది. 2023 సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.