Begin typing your search above and press return to search.

సొంతూరు వెళ్ల‌డానికి ర‌ష్మిక భ‌య‌ప‌డుతోందా?

By:  Tupaki Desk   |   13 Dec 2022 7:30 AM GMT
సొంతూరు వెళ్ల‌డానికి ర‌ష్మిక భ‌య‌ప‌డుతోందా?
X
క‌న్న‌డ ఇండ‌స్ట్రీ నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న‌ని బ్యాన్ చేసిందా?.. త‌న‌కు క‌న్న‌డ సినిమాల్లో ప‌టించే అవ‌కాశం ఇవ్వ‌డం లేదా?..'కాంతార‌' కార‌ణంగానే ర‌ష్మిక క‌న్న‌డ నాట తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందా? .. అంటూ ఇటీవ‌ల సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌లువురు నెటిజ‌న్ లు ర‌ష్మిక‌ని టార్గెట్ చేస్తూ నెట్టింట ట్రోల్ చేసిన విష‌యం తెలిసిందే. ర‌ష్మిక‌పై ఈ స్థాయిలో నెగిటివిటీ ప్ర‌చారం కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం రిష‌బ్ శెట్టి తెర‌కెక్కించిన 'కాంతార‌' మూవీ. రీసెంట్ గా ఈ మూవీపై ర‌ష్మిక చేసిన వ్యాఖ్య‌లే త‌న‌ని వివాదంలో ప‌డేశాయి. నెట్టింట నెటిజ‌న్ ల ట్రోల్ కు గుర‌య్యేలా చేశాయి.

ర‌ష్మిక 'కాంతార' విష‌యంలో ఇచ్చిన స్టేట్ మెంట్ కార‌ణంగా త‌న‌ని క‌న్న‌డ ఇండ‌స్ట్రీ, నిర్మాత‌లు బ్యాన్ చేశార‌ని, త‌న‌కు క‌న్న‌డ సినిమాల్లో న‌టించే ఆఫ‌ర్ల‌ని నిర్మాత‌లు ఇవ్వ‌డానికి ఇష్ట‌ప‌డ‌టం లేద‌ని, ఈ నేప‌థ్యంలో ర‌ష్మిక త‌న సొంత ఊరు కూడా వెళ్ల‌డానికి భ‌య‌ప‌డుతోందంటూ వ‌రుస క‌థ‌నాలు సోష‌ల్ మీడియా వేదిక‌గా జోరుగా ప్ర‌చారం అయ్యాయి. అయితే వీట‌న్నింటిపై తాజాగా ర‌ష్మిక మంద‌న్న వివ‌ర‌ణ ఇచ్చింది.

క‌న్న‌డ ఇండస్ట్రీకి చెందిన కొంత మంది నిర్మాత‌లు త‌న‌ని బ్యాన్ చేశార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని, ఆ వార్త‌ల్లో ఎలాంటి వాస్త‌వం లేద‌ని క్లారిటీ ఇచ్చేసింది. ఇంత వ‌ర‌కు అలాంటి విష‌యాలేవీ త‌న వ‌ద్ద‌కు రాలేద‌ని, ఇతంతా సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారం మాత్ర‌మేన‌ని కొట్టి పారేసింది. క‌న్న‌డ ఇండ‌స్ట్రీపై, సినిమాల‌కు నాకు ఎప్ప‌టికీ ప్రేమ వుంటుంది. అది తెలియ‌క కొంత మంది నాపై దుష్ప్రచారం చేస్తున్నార‌ని మండిప‌డింది.

ఇక 'కాంతార‌' వివాదం గురించి మాట్లాడుతూ .. 'కాంతార 'విడుద‌లైన రెండు రోజుల‌కే ఆ సినిమా గురించి అడగ‌డంతో నేను అప్ప‌టి వ‌ర‌కు ఆ సినిమా చూడ‌లేదు కాబ‌ట్టి దానిపై స‌రిగా స్పందించ‌లేక‌పోయాన‌ని తెలిపింది.

ఆ త‌రువాత సినిమా చూసి చిత్ర బృందానికి మెసేజ్ చేశాన‌ని, వారు కూడా థాంక్యూ అని రిప్లై ఇచ్చారంది. నా వ్య‌క్తిగ‌త విష‌యాల‌ని కూడా ప్ర‌పంచానికి చూపించ‌లేన‌ని అస‌హానాన్ని వ్య‌క్తం చేసింది. వ్య‌క్తిగ‌త విష‌యాలు ప్ర‌పంచానికి అన‌వ‌స‌ర‌మ‌ని తెలిపింది.

ఇక వృత్తి ప‌రంగా నా సినిమాల గురించిచెప్ప‌డం నా బాధ్య‌త అంది. ఇక త‌న‌పై చ‌రుగుతున్న ప్ర‌చారం గురించి మాట్లాడుతూ .. కావాల‌నే కొంద‌రు త‌న‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని, త‌న‌ని అగౌర‌వ ప‌రిచే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని స్ప‌ష్టం చేసింది. అంతే కాకుండా వ్య‌క్తిగ విమ‌ర్శ‌ల‌ని ప‌ట్టించుకోవ‌డం ఎప్పుడో మానేశాన‌ని, ప్ర‌స్తుతం విజ‌య్ తో క‌లిసి న‌టించిన 'వారీసు' విజ‌యం కోసం.. దాని రిజ‌ల్ట్ కోసం ఎదురుచూస్తున్నాన‌ని వెల్ల‌డించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.