Begin typing your search above and press return to search.

ర‌ష్మికతో అది ఐట‌మ్ కాదంట‌గా!

By:  Tupaki Desk   |   8 Dec 2022 8:30 AM GMT
ర‌ష్మికతో అది ఐట‌మ్ కాదంట‌గా!
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన పాన్ ఇండియా వండ‌ర్ 'పుష్ప ది రైజ్‌'. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కించిన ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా సంచ‌ల‌నాలు సృష్టించిన విష‌యం తెలిసిందే. బ‌న్నీ క్రేజ్ ని దేశ వ్యాప్తంగా చేసిన ఈ మూవీ ఊహ‌కంద‌ని స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి బ‌న్నీని పాన్ ఇండియా స్టార్ గా నిల‌బెట్టింది. ఈ సంచ‌ల‌న మూవీలో శ్రీ‌వ‌ల్లిగా న‌టించి త‌న‌దైన మార్కు న‌ట‌న‌తో ర‌ష్మిక మంద‌న్న ఆక‌ట్టుకుంది. త‌ను కూడా ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ ల జాబితాలో చేరిపోయింది.

ప్ర‌స్తుతం 'పుష్ప 2' కోసం రెడీ అవుతున్న ర‌ష్మిక త‌మిళ స్టార్ హీరో విజ‌య్ తో క‌లిసి 'వార‌సుడు' మూవీలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో ఈ మూవీని 2023 సంక్రాంతికి భారీ స్థాయిలో రిలీజ్ చేయాల‌ని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా వుంటే స‌మంత త‌ర‌హాలోనే ర‌ష్మిక కూడా కూడా ఓ స్పెష‌ల్ సాంగ్ కి రెడీ అవుతున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. తొలిసారి 'పుష్ప‌' మూవీ కోసం స‌మంత 'ఊ అంటావా.. ఊహూ అంటావా...' అంటూ ప్ర‌త్యేక సాంగ్ లో న‌టించ‌డం.. అది వ‌ర‌ల్డ్ వైడ్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిల‌వ‌డం తెలిసిందే.

ఇదే స్థాయిలో ర‌ష్మిక‌తో స్పెష‌ల్ సాంగ్ ని సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో గురూజీ తెర‌కెక్కిప‌స్తున్న SSMB 28 కోసం ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. సూపర్ స్టార్ మ‌హేష్ బాబుతో త్రివిక్ర‌మ్ ఓ భారీ మూవీని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ముందు అనుకున్న స్టోరీని ప‌క్క‌న పెట్టిన త్రివిక్ర‌మ్ తాజాగా కొత్త క‌థ‌తో మ‌హేష్ SSMB 28 ని తెర‌పైకి తీసుకురాబోతున్నారు. బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీ కోసం ప్ర‌త్యేకంగా ఓ స్పెష‌ల్ సాంగ్ ని ర‌ష్మిక తో చేయాల‌ని త్రివిక్ర‌మ్ ప్లాన్ చేస్తున్నాడ‌ట‌.

అయితే ఇది ఐటమ్ సాంగ్ అని ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ టీమ్ మాత్రం ఇది ఐట‌మ్ సాంగ్ కాద‌ని 'పుష్ప‌'లో స‌మంత చేసిన త‌ర‌మాలో సాగే స్పెష‌ల్ సాంగ్ అని అంటున్నార‌ట‌. ఇందు కోసం ర‌ష్మిక భారీ స్థాయిలో డిమాండ్ చేస్తుండ‌గా, చిత్ర బృందం త‌న‌తో చ‌ర్చ‌లు జ‌రుపుకున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.