Begin typing your search above and press return to search.
#RC -15 2024లోనే రిలీజ్ అవుతుందా?
By: Tupaki Desk | 3 Oct 2022 6:20 AM GMTమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఆర్ సీ 15 తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయింది. బ్యాలెన్స్ షూట్..పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసి వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలన్నది శంకర్ -దిల్ రాజుల ప్లాన్. మరి ఇప్పుడు ఆ ప్లాన్ లో మార్పులొచ్చాయా? 2023 లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా 2024కి వాయిదా వేసారా? అదే సరైన సమయంగా భావిస్తున్నారా? అంటే అవుననే సమాచారం అందుతోంది.
ప్రస్తుతం శంకర్ ఆర్ సీ 15 తో పాటు..భారతీయుడు -2 షూట్ లో కూడా పాల్గొంటున్నట్లు వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ టూ చెన్నై చక్కెర్లు కొడుతు శంకర్ రెండు పడవల ప్రయాణాన్ని మొదలు పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఆర్ సీ 15 షూట్ లో ప్లాన్ ఛేంజ్ అయినట్లు తాజా సమాచారం. ఇంకా ఈ సినిమా కి సంబంధించి 100 నుంచి 120 రోజులు షూటింగ్ భాగమే మిగిలి ఉంది. అటుపై మరో నాలుగైదు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ పనులు నిర్వహించాల్సి ఉంది.
ఇంత టైట్ షెడ్యూల్ నడుమ శంకర్ సినిమాకి డేట్లు కేటాయించడం ఇబ్బంది గా మారడంతో ఆర్ సీ 15 తాత్కాలికంగా పక్కనబెట్టేసినట్లు సమాచారం. ఆ కారణంగా సినిమా ని వచ్చే ఏడాది కి బధులు 2024 లోనే రిలీజ్ చేసే కొత్త ఆలోచనతో శంకర్ అండ్ కో ముందుకు కదులుతున్నట్లు తెలిసింది. శంకర్ ని తొందరపెట్టి ఇబ్బంది పెట్టడం కన్నా కావాల్సినంత సమయం ఇచ్చి ప్ర శాంతంగా పూర్తిచేయడమే ఉత్తమం అని చరణ్..దిల్ రాజు అనుకుని శంకర్ పై ఒత్తిడి తగ్గించినట్లు లీకులందుతున్నాయి.
ప్రస్తతుం శంకర్ పూర్తిగా ఇండియన్ -2 షూట్ లో నిమగ్నమవుతున్నారని...ఆ సినిమా పూర్తయిన తర్వాత నయా మేకర్ 'ఆర్ సీ 15'ని టచ్ చేయనున్నారని కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. మరి ఇందులో నిజమెంతో తెలియాలి. ఇదే వాస్తవం అయితే? చరణ్ అభిమానులకు షాక్ తప్పదు. ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురుచూస్తున్నారు.
అభిమానులందరిలో వచ్చే ఏడాది సమ్మర్ బలంగా రిజిస్టర్ అయి ఉంది. ఇప్పుడీ సినిమా వచ్చే ఏడాది కాదు..ఆ పై ఏడాదంటే భారీ నిరుత్సాహం తప్పదు. అటు యంగ్ టైగర్ ఎన్టీర్ 30వ సినిమా కూడా వచ్చే ఏడాది రిలీజ్ కాదు.
ఇంత వరకూ ఆ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లలేదు. ఈ నేపథ్యంలో అది ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ఎప్పుడు పూర్తిచేస్తారు? అన్నది క్లారిటీ లేదు. ఇప్పటికే నిరాశలో ఉన్న తారక్ అభిమానులు 'ఆర్ ఆర్ ఆర్' తో దోస్తీ కట్టిన చరణ్ చెప్పే నిజంతోనే మరింత షాక్ అవ్వాల్సి వస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.