Begin typing your search above and press return to search.
#గుసగుస.. మళ్లీ ప్రేమలో పడ్డ తూనీగ?
By: Tupaki Desk | 10 Dec 2022 11:04 AM GMTతూనీగ తూనీగ ఎందాక పరిగెడతావే రావే నా వంకా..! 'తూనీగ తూనీగ' టైటిల్ తోనే ఎం.ఎస్.రాజు తెరకెక్కించిన చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రియా చక్రవర్తి అటుపై బాలీవుడ్ లోనూ నటించింది. రియా చుట్టూ ఆరంభం నుంచి ఏవో వివాదాలు కనిపించాయి. మహేష్ భట్ లాంటి సీనియర్ నిర్మాతతో రియా ఎఫైర్ పెట్టుకుందన్న గసగుసలు వినిపించాయి. ఇక ఇటీవలి కాలంలో బాలీవుడ్ డ్రగ్ సిండికేట్ కేసులో రియా పేరు ప్రముఖంగా వినిపించింది. ప్రియుడు సుశాంత్ సింగ్ అనుమానాస్పద మరణంతో రియా చిక్కుల్లో పడింది. అనంతరం ఈ కేసులో రియా చక్రవర్తి తన సోదరుడు జైలు జీవితాన్ని అనుభవించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెయిల్ పై రియా బయటే ఉంది. కానీ సినిమాల్లో అవకాశాల్లేవ్.
రియా చక్రవర్తి రెండేళ్ళ తర్వాత తిరిగి ఓ అవకాశం అందుకుందని ఇంతకుముందే వార్తలు వచ్చాయి. చాలా కాలం తర్వాత మళ్లీ బుల్లితెరపై నటించేందుకు సిద్ధమైందని టాక్ వినిపించింది. 'నెవర్ గివింగ్ అప్' వైఖరికి నిజమైన అర్థం రియా. అయితే ఇప్పుడిప్పుడే అన్ని కలతల నుంచి బయటపడుతున్న ఈ భామ .. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన 2 సంవత్సరాల కు మళ్లీ ప్రేమలో పడిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. తూనీగ పయనం ఆగలేదు. అది ఇంకా ఇంకా కొనసాగుతూనే ఉంటుంది! అంటూ ఇప్పుడు తెలుగు మీడియాలోను కథనాలొస్తున్నాయి.
అవకాశాల్లేకుండా జీవితంలో ముందుకు సాగడం చాలా కష్టమైన ప్రక్రియ.. కానీ బతుకు తెరువు కోసం ఇవి చాలా ముఖ్యం. 2020లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించిన తర్వాత వివాదాలు న్యాయ పోరాటాల సుడిగుండంలో చిక్కుకున్న రియా చక్రవర్తి సరైన దిశలో ఒక అడుగు వేసినట్లు కనిపిస్తోందని .. ఈ పరిస్థితుల్లో తాను బుల్లితెర అడుగులు వేయాలనుకోవడం సరైన నిర్ణయమని అంతా భావించారు.
తాజా గుసగుసల ప్రకారం.. వెటరన్ నటి సీమా సజ్దే సోదరుడు నిర్మాత బంటీ సజ్దేహ్ తో రియా డేటింగ్ సాగిస్తోందని.. సుశాంత్ మరణించిన రెండేళ్లకు మళ్లీ ఒక తోడు నీడను ప్రేమను పొందిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. రియా - బంటీ తమ సంబంధాన్ని ప్రస్తుతానికి ప్రైవేట్ గా ఉంచాలనుకుంటున్నారని ప్రముఖ జాతీయ మీడియా కథనం పేర్కొంది.
నిర్మాతల సహచరులు రియా సన్నిహితులు వారిని ఇలా జంటగా కలిసి చూడటం ఆనందంగా ఉందని ఒక సోర్స్ వెల్లడించినట్టు సదరు కథనం పేర్కొంది. బంటీ గత రెండేళ్లలో రియాకు కష్టకాలంలో కుడి భుజంగా నిలిచాడు. సహనటుడిగా అతడు సుపరిచితుడు. రియాపై చాలా ఆరోపణలు వెల్లువెత్తినా.. రకరకాల ఊహాగానాలు సాగినా క్లిష్ఠమైన డర్టీ గేమ్ సమయంలో ఆమెకు అండగా నిలిచాడు.
అంతేకాదు... బంటీ టాలెంట్ మేనేజ్ మెంట్ సంస్థ గతంలో రియా వృత్తిపరమైన కాల్షీట్లను చూసేది. SSR డ్రగ్స్ కేసులో ఆమె ప్రమేయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నప్పుడు అతన్ని కూడా ప్రశ్నించడానికి పిలిచారని కూడా సోర్సెస్ వెల్లడించాయి. బంటీ సజ్దేహ్ కార్నర్ స్టోన్ స్పోర్ట్ CEO. ఇది స్పోర్ట్స్ ఎంటర్ టైన్ మెంట్ ప్రపంచంలోని బిగ్ షాట్స్ తో వ్యవహారాలను డీల్ చేసే టాలెంట్ మేనేజ్ మెంట్ ఏజెన్సీ. వారి ఖాతాదారులలో విరాట్ కోహ్లీ- రోహిత్ శర్మ - శిఖర్ ధావన్ సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. బంటీ కూడా ధర్మ కార్నర్ స్టోన్ కొల్లాబ్ లో ఒక భాగం. ఈ సాహచర్యం విజయవంతంగా ముందుకు సాగుతోంది. వినోదరంగంలో ప్రతిభను కనుగొనడం ఉనికిని మ్యానేజ్ చేయడం ఈ సంస్థ పని.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం డ్రగ్స్ కేసుతో ముడిపడిన సుడిగాలి వివాదాలు రియాను కుంగదీసినా బంటి సహకారం దీనినుంచి బయటపడేందుకు ఎంతగానో సహకరించిందని సమాచారం. రియా నటించిన చివరి చిత్రం చెహ్రే.. ఇందులో ఆమె అమితాబ్ బచ్చన్ - ఇమ్రాన్ హష్మీలతో కలిసి నటించింది. ప్రస్తుతం అవకాశాల వేట సాగిస్తోంది. అదే క్రమంలో మరోసారి ప్రేమలో పడిందని గుసగుసలు వైరల్ అవుతున్నాయి. రియా... ఆమె సోదరుడు షోక్ 2020 నుండి రకరకాల చట్టపరమైన సమస్యల్లో చిక్కుకుని సామాజికంగాను పోరాడారు. ఇటీవలే తిరిగి ప్రజా జీవితంలోకి వచ్చారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.