Begin typing your search above and press return to search.
రాఖీభాయ్.. ప్రభాస్ ని ఫాలో అవ్వనంటున్నాడా?
By: Tupaki Desk | 8 May 2022 7:30 AM GMTకన్నడ రాకింగ్ స్టార్ యష్ ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. 2018లో వచ్చిన 'కేజీఎఫ్ చాప్టర్ 1' ఊహించని విధంగా సంచలన విజయాన్ని సాధించింది. కన్నడ సినీమా అంటే తెలియని ప్రతీ ఒక్కరికీ కన్నడ సినిమా సత్తాని చాటింది. భారీ స్థాయిలో వసూళ్లని రాబట్టిన ఈ మూవీ భారతీయ సినీ చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించిన తొలి కన్నడ చిత్రంగా నిలిచింది. తాజాగా విడుదలైన 'కేజీఎఫ్ 2' కూడా అంతకు మించి వసూళ్ల ప్రభంజనాన్ని సృష్టిస్తూ దేశ వ్యాప్తంగా సరికొత్త చర్చకు తెరలేపింది.
ప్రస్తుతం ఎక్కడ విన్నా ఒకటే మాట కేజీఎఫ్.. కేజీఎఫ్.. అంతగా దేశం మొత్తం హాట్ టాపిక్ గా మారింది. హిందీలో అత్యధిక వసూళ్లని రాబట్టిన సినిమాగా రికార్డుని సొంతం చేసుకుని బాలీవుడ్ లో సరికొత్త రికార్డుని నెలకొల్పింది. అంతే కాకుండా హిందీలో 400 కోట్లు క్రాస్ చేసిన సెకండ్ మూవీగా నిలిచి ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో బాలీవుడ్ ఫిల్మ్ దంగల్ లైఫ్ టైమ్ బాలీవుడ్ కలెక్షన్స్ ని అలవోకగా అధిగమించేసింది. కేజీఎఫ్ 2 ఈ ఫీట్ ని మూడవ వారంలోనే సాధించడం విశేషంగా చెప్పుకుంటున్నారు. అంతే కాకుండా 'బాహుబలి 2' లైఫ్ టైమ్ బాలీవుడ్ రికార్డ్ పై కన్నేయడం ఇప్పడు ఆసక్తికరంగా మారింది.
బాహుబలి 2 హిందీ వెర్షన్ లైఫ్ టైమ్ కలెక్షన్స్ 511. త్వరలోనే ఈ రికార్డుని క్రాస్ చేయడం ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ మూవీ వంద కోట్లని దాటడం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. కన్నడ దిగ్గజ హీరోల వల్ల కానీ ఫీట్ ని యష్ ఈ సినిమాతో అద్భుతం చేయడం విశేషంగా చెప్పుకుంటున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత ప్రభాస్ లాగే యష్ తప్పటడుగులేస్తాడా? అనే చర్చ మొదలైంది.
బాహుబలి తరువాత ప్రభాస్ వన్ ఫిల్మ్ వండర్ డైరెక్టర్లతో భారీ బడ్జెట్ లతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశారు. కానీ అవి ఆశించిన ఫలితాన్ని అందించలేకపోగా భారీ నష్టాలని అందించాయి. సుజీత్ తో చేసిన 'సాహో' ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సోసోగా ఆడగా ఉత్తరాదిలో మాత్రం భారీ వసూళ్లని రాబట్టింది. ఇక రాధా కృష్ణ కుమార్ తో చేసిన 'రాధేశ్యామ్' భారీ డిజాస్టర్ గా నిలిచింది. అయితే అదే మిస్టేక్స్ ని యష్ కూడా కంటిన్యూ చేస్తాడా? ఈ విషయంలో ప్రభాస్ ని ఫాలో అవుతాడా? అంటే నో వే అంటున్నాయి కన్నడ వర్గాలు.
ఇటీవల 'కేజీఎఫ్ 2' ఇంటర్వ్యూల్లో ప్రశాంత్ నీల్ వల్లే ఈ సినిమా ఈ స్థాయిలో విజయాన్ని సాధించిందని, సినిమా విజయంలో దర్శకుడిదే ప్రధాన పాత్ర అని తనని ఎలా ప్రజెంట్ చేస్తే బాగుంటుందో దర్శకులకు తెలుసని, అలాంటి డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తానని స్పష్టం చేశాడు. ఈ నేఫథ్యంలో 'కేజీఎఫ్ 2' తరువాత ప్రభాస్ లా కాకుండా చాలా జాగ్రత్తగా సెలెక్టీవ్ గా ప్రాజెక్ట్ లని ఎంచుకోబోతున్నాడట. బాలీవుడ్ నుంచి, దక్షిణాదిలో వున్న స్టార్ డైరెక్టర్ల నుంచి ఆఫర్లు వచ్చినా ఇప్పటికీ ఏ ప్రాజెక్ట్ ని అంగీకరించని యష్ తన రేంజ్ కి తగ్గ కథ, దర్శకుడితోనే ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేసుకుంటున్నాడట.
అయితే ఫ్యాన్స్ మాత్రం 'కేజీఎఫ్ పార్ట్ 3' వరకు మరే ప్రాజెక్ట్ చేయెద్దని చెబుతున్నారట. మరి రాఖీ భాయ్ అన్ని నెలల ప్రశాంత్ నీల్ కోసం వేచి చూస్తాడా? అన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. 2018లో చాప్టర్ 1 విడుదలైంది. ఆ తరువాత టైమ్ అంతా మరో సినిమాకు కేటాయించకుండా పార్ట్ 2 కే కేటాయించాడు యష్. ఇదే తరహాలో ఫ్యాన్స్ అన్నట్టుగా చాప్టర్ 3 కోసం వేచి చూస్తాడా? లేక మరో స్ట్రాంగ్ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అన్నది వేచి చూడాల్సిందే.