Begin typing your search above and press return to search.
'రౌడీ ఫెలో' డైరెక్టర్ తో 'రౌడీ బేబీ' మ్యూజిక్ డైరెక్టర్..?
By: Tupaki Desk | 7 Jun 2022 10:52 AM ISTలిరిసిస్ట్ గా కెరీర్ ప్రారంభించి ఎన్నో అద్భుతమైన పాటలు రాసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ చైతన్య.. 'రౌడీ ఫెలో' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. తొలి చిత్రంతోనే తన ప్రతిభను చాటుకుని ప్రేక్షకులతో పాటుగా సినీ ప్రముఖుల దృష్టిని ఆకర్షించాడు.
ఈ క్రమంలో నితిన్ తో చేసిన 'చల్ మోహన్ రంగా' సినిమా కూడా డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం అతనితో సినిమా నిర్మించడానికి రెడీ అయ్యారంటే కృష్ణ చైతన్య టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
అయితే ఇప్పుడు డైరెక్టర్ గా తన మూడో చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకొచ్చే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు కృష్ణ చైతన్య. టాలీవుడ్ వర్సటైల్ హీరో శర్వానంద్ తో ఓ సినిమాను తెరకెక్కించనున్నారని సమాచారం. ఇందులో శర్వా ను ఇంతకుముందెన్నడు చూడని విధంగా సూపర్ ఎనర్జిటిక్ పాత్రలో సరికొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నారని తెలుస్తోంది.
గత కొంతకాలంగా వరుస పరాజయాలతో డీలా పడిపోయిన శర్వా.. ఈసారి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఎన్నో కథలు విన్న తర్వాత.. కృష్ణ చైతన్య చెప్పిన స్క్రిప్ట్ ఎంతో ఎగ్జైట్ చేయడంతో వెంటనే యంగ్ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించనుందని టాక్. శర్వానంద్ - కృష్ణ చైతన్య కాంబోలో రూపొందనున్న ఈ సినిమా గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ చిత్రంతో తమిళ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా చాలా గ్యాప్ తర్వాత మళ్లీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం.
కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ కంపోజర్ యువన్ శంకర్ రాజా గతంలో పలు తెలుగు సినిమాలకు సంగీతం సమకూర్చారు. ఆ తర్వాత ఎందుకనో తెలుగులో సినిమాలు తగ్గించారు. అయితే మంచి కథ దొరికితే టాలీవుడ్ లోకి రావాలని వేచి చూస్తున్న యువన్.. మధ్యలో ఎంతమంది దర్శకులు అడిగినా స్క్రిప్టు నచ్చకపోవడంతో చేయలేదు.
కానీ ఇప్పుడు కృష్ణ చైతన్య చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో.. యువన్ వెంటనే మ్యూజిక్ అందించడానికి ఒప్పుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం డజనుకు పైగా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. కథ బాగా నచ్చడంతో శర్వా చిత్రానికి సంగీతం చేయడానికి ఓకే చెప్పారని తెలుస్తోంది.
రెండు సినిమాలతోనే మంచి టేస్ట్ ఉన్న సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పాటల రచయిత కృష్ణ చైతన్య.. ఇప్పుడు శర్వానంద్ సినిమాతో సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. ఇక నితిన్ తో అనౌన్స్ చేసిన 'పవర్ పేట' సినిమా కూడా శర్వా మూవీ తరువాత సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.
నితిన్ ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటం.. భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతికతో తెరకెక్కించాల్సిన సినిమా కావడంతో.. ప్రస్తుతానికి కృష్ణ చైతన్య తో చేయాల్సిన 'పవర్ పేట' చిత్రాన్ని హోల్డ్ లో పెట్టారని వినికిడి. నితిన్ కమిట్మెంట్స్ పూర్తి చేసిన తర్వాత ఈ సినిమా చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.