Begin typing your search above and press return to search.
బీమ్లా షాకింగ్ ఎంట్రీకి RRR కారణమా..?
By: Tupaki Desk | 16 Feb 2022 9:41 AM GMTటాలీవుడ్ లో మహా శివరాత్రి పండుగ సందర్భంగా ఏయే సినిమాలు విడుదల కాబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. 'భీమ్లా నాయక్' విడుదల తేదీ ప్రకటించడంతో బరిలో ఏ సినిమా నిలుస్తుంది.. ఏ మూవీ వెనక్కి వెళ్తుందనే విశ్లేషణలు మొదలయ్యాయి.
పాన్ ఇండియా స్థాయిలో 'వలిమై' సినిమా ఫిబ్రవరి 24న రిలీజ్ విషయం మీద ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అలానే కోవిడ్ పాండమిక్ వల్ల అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన 'గంగూబాయి' మూవీ కూడా ఫిబ్రవరి 25న విడుదల కావడం ఖాయం.
కాకపోతే 'ఆడవాళ్లు మీకు జోహార్లు' - 'గని' - 'సెబాస్టియన్' సినిమా రిలీజుల విషయంలో మార్పులు ఉండే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. 'భీమ్లా నాయక్' చిత్రాన్ని పరిస్థితులను బట్టి ఫిబ్రవరి 25న లేదా ఏప్రిల్ 1న థియేటర్లలోకి తీసుకొస్తామని మేకర్స్ ప్రకటించారు.
ఏపీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమా వచ్చే ఛాన్స్ లేదని భావించి.. వరుణ్ తేజ్ - శర్వానంద్ - కిరణ్ అబ్బవరం వంటి హీరోలు ఈ నెల 25న బరిలో దిగాలని ఫిక్స్ అయ్యారు. దీనికి తగ్గట్టుగానే అన్నీ ప్లాన్ చేసుకొని జోరుగా ప్రమోషన్స్ చేసుకుంటూ వచ్చారు.
కానీ ఇప్పుడు 'భీమ్లా నాయక్' చిత్రాన్ని ఫిబ్రవరి 25నే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఏపీలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం సైడ్ నుంచి ప్రకటన రాకముందే సడన్ గా రిలీజ్ డేట్ ఇవ్వడం అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి RRR మూవీ కూడా ఒక కారణమనే టాక్ వినిపిస్తోంది.
జక్కన్న సినిమా వస్తుందంటే ఎవరైనా రెండు వారాలు ముందూ వెనుకా చూసుకొని రిలీజ్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మార్చి 25న విడుదల చేయనున్నారు. దీని కోసం వరుసగా రెండు వారాల పాటు అన్ని ఏరియాలలో థియేటర్లను బ్లాక్ చేస్తారు.
RRR సినిమా దాదాపు అన్ని థియేటర్లను బ్లాక్ చేసుకుంది కాబట్టి.. తదుపరి వారం ఏప్రిల్ 1న రిలీజ్ అయ్యే 'భీమ్లా నాయక్' కు తగినంత స్క్రీన్లు లభించవు. అది పవన్ సినిమా బిజినెస్ మీద దెబ్బపడుతుంది. ఏపీలో ఆక్యుపెన్సీ మరియు టిక్కెట్ ధరలు పెంపు అంశాలతో సంబంధం లేకుండా ఫిబ్రవరి 25వ తేదీని ఖరారు చేయడానికి ఇదొక కారణమని టాక్ నడుస్తోంది.
ఇప్పుడు మహాశివరాత్రి ఫెస్టివల్ లాంగ్ వీకెండ్ తో పాటుగా ఏప్రిల్ 14వ తేదీ వరకు పవన్ కళ్యాణ్ సినిమాకు పోటీ ఉండదని అభిమానులు భావిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.