Begin typing your search above and press return to search.

రూ.15 లక్షలు చిన్న మొత్తమా ఆలియా..?

By:  Tupaki Desk   |   23 Aug 2022 12:30 AM GMT
రూ.15 లక్షలు చిన్న మొత్తమా ఆలియా..?
X
బాలీవుడ్‌ లో ఇప్పటికే పరిస్థితులు అస్సలు బాగాలేదు. ఎవరు ఏం మాట్లాడితే ఆ మాటలను ట్రోల్స్ చేద్దామా... వారి సినిమాలను బాయ్ కాట్‌ చేద్దామా అంటూ కొందరు ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఆలియా భట్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఒక ఇంటర్వ్యూలో ఆలియా భట్ మాట్లాడుతూ తన మొదటి సినిమా పారితోషికం గురించి మరియు తన యొక్క ఆదాయం గురించి మాట్లాడింది.

ఆలియా తన 19వ ఏట మొదటి సినిమాలో నటించింది. ఆ సినిమాకు గాను నిర్మాతల నుంచి ఆలియా మొదటి పారితోషికం గా రూ.15 లక్షల రూపాయల చెక్ ను అందుకుందట.

ఆ చెక్ ను నేరుగా తీసుకెళ్లి అమ్మకు ఇచ్చిందట. ఆ సమయంలో తన పారితోషికం చాలా తక్కువ అని ఆలియా బాధ పడిందట. అంత తక్కువ పారితోషికం కు సినిమా చేయాల్సి వచ్చిందని కూడా ఆ సమయంలో ఆలియా కాస్త ఇబ్బంది పడిందట.

ఆ తర్వాత నుండి తన పారితోషికం భారీగా పెరిగింది. రెండేళ్లలో తన ఆదాయం చాలా పెరిగింది. తన బ్యాంక్‌ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలియదు.. కాని నా బ్యాంకు బ్యాలెన్స్ చాలా ఉందని మాత్రం తెలుసు. ఇప్పటికి కూడా అమ్మ నా యొక్క అకౌంట్ విషయాలు చూస్తూ ఉంటుంది. నా ఆదాయం ఎంత.. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అనే విషయాలను నేను ఎప్పుడు తెలుసుకోవాలని అనుకోలేదు.

నా యొక్క అకౌంట్ విషయాలు నన్నే చూసుకోవాలని అమ్మ చెబుతూ ఉంటుంది. ఇప్పుడు నేను తల్లి ని కాబోతున్నాను. నాకంటూ బాధ్యతలు ఉండాలి. కనుక నేను నా యొక్క అకౌంట్ ను చూసుకోవడం నేర్చుకోవాలని భావిస్తున్నాను. ఇక నుండి నా యొక్క అకౌంట్‌ విషయాల పట్ల నేను శ్రద్ధ వహించాలని అనుకుంటున్నాను అంటూ ఆలియా చెప్పుకొచ్చింది.

ఆలియా డబ్బు విషయంలో చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుబడుతున్నారు. మీరు స్టార్‌ కిడ్ కనుక మీ యొక్క మొదటి పారితోషికం 15 లక్షలు అయినా కూడా చాలా తక్కువ అనిపించింది. కొత్త హీరోయిన్స్ కి బ్యాక్ గ్రౌండ్ లేని హీరోయిన్స్ కి మినిమం పారితోషికం కూడా ఇవ్వరు. ఆ విషయం మీకు తెలుసా అంటూ కొందరు ఆలియా ను విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.