Begin typing your search above and press return to search.
ఇస్మార్ట్ హీరోతో అప్పట్లో డైరెక్టర్!
By: Tupaki Desk | 13 Feb 2019 8:05 AM GMTదర్శకుడు సాగర్ కే. చంద్ర తెలుసు కదా? రాజేంద్ర ప్రసాద్ హీరోగా 'అయ్యారే' అనే కామెడీ సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. నారా రోహిత్.. శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో తెరకెకెక్కిన 'అప్పట్లో ఒకడుండేవాడు' సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. 2016 లో విడుదలైన ఈ సినిమా సాధారణ ప్రేక్షకులనే కాకుండా విమర్శకులను కూడా మెప్పించింది. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఇప్పటివరకూ తన నెక్స్ట్ సినిమా పట్టాలెక్కలేదు.
గతంలో మెగా హీరో వరుణ్ తేజ్ తో సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయిగానీ ఆ సినిమా ఎందుకో సెట్ కాలేదు. తాజా సమాచారం ప్రకారం సాగర్ చంద్ర ఎనర్జిటిక్ హీరో రామ్ కు ఒక ఇంట్రెస్టింగ్ కథను వినిపించాడట. రామ్ కు కథ నచ్చడంతో పూర్తిస్థాయి స్క్రిప్ట్ తయారు చేయమని కోరాడట. అంతా సవ్యంగా జరిగితే సాగర్ చంద్ర కు రామ్ నెక్స్ట్ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం లభించవచ్చు. రామ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం ఈ సినిమా రామ్ హోమ్ బ్యానర్ స్రవంతి మూవీస్ లో ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది.
రామ్ ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో నటిస్తున్నాడు. రీసెంట్ గా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాను ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాలో రామ్ కు జోడీగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాతే సాగర్ చంద్ర సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.