Begin typing your search above and press return to search.

సాయి తేజ్ ముందు జాగ్రత్త

By:  Tupaki Desk   |   23 April 2019 5:29 AM GMT
సాయి తేజ్ ముందు జాగ్రత్త
X
వరసగా రెండేళ్లలో ఆరు డిజాస్టర్లు ఖాతాలో వేసుకుని మార్కెట్ ని డేంజర్ లో పడేసుకున్న సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఎట్టకేలకు పేరులో ధరమ్ ని తీసేసి చిత్రలహరితో ఓ మాదిరి సక్సెస్ అయితే అందుకున్నాడు. నిజానికి ఇతని మార్కెట్ పాతిక కోట్ల దాకా ఉందని గతంలోనే ప్రూవ్ అయ్యింది. ఒకవేళ ఆ లెక్కల్లో కనక చిత్రలహరి అమ్మి ఉంటె నష్టం మిగిలి ఫ్లాప్ ముద్ర పడేది. కానీ అందులో సగం ధరకే మైత్రి సంస్థ బిజినెస్ చేయడంతో బయ్యర్లు దాదాపుగా సేఫ్ అయ్యారు.

ఏదైతేనేం మొత్తానికి ఇది సాయి తేజ్ కు కోలుకునే అంశమే. నిజానికి ధరమ్ అనే పేరు తీసేయడానికి కారణం దర్శకుడు మారుతీనట.న్యూమరాలజీ ప్రకారం ఈ మార్పు సూచించడంతో తేజ్ ఫైనల్ గా ఈ నిర్ణయం తీసుకన్నాడట. కారణం ఏదైనా తేజ్ అయితే రిలాక్స్ అవుతున్నాడు. ఇప్పుడు ఇన్ సైడ్ టాక్ ప్రకారం మారుతీ-సాయి తేజ్ లు కొత్త ప్రాజెక్ట్ కోసం చేతులు కలపబోతున్నారు. గతంలోనే ఓ లైన్ అనుకున్నప్పటికీ చిత్రలహరి ఫలితం చూసాక డిసైడ్ అవుదాం అనుకున్నారట.

మసాలా అంశాలు లేకుండానే జనం సాయి తేజ్ ని రిసీవ్ చేసుకున్నారు కాబట్టి అందుకు తగ్గట్టే నెక్స్ట్ మూవీ కూడా సాఫ్ట్ ఎమోషనల్ టచ్ ఉన్న కథనే ఎంచుకుంటారట. దీనికి సంబంధించిన ప్రకటన మరికొద్ది రోజుల్లో రావొచ్చు. శైలజారెడ్డి అల్లుడు ఇచ్చిన షాక్ తర్వాత కొన్నాళ్ళు సైలెంట్ గా మారుతీకి నిర్మాతగా ఇతర దర్శకులతో తీసిన సినిమాలు కూడా గత ఏడాది అచ్చిరాలేదు. అందుకే కొత్త సంవత్సరం ఫ్రెష్ స్క్రిప్ట్ తో సాయి తేజ్ తో ప్లానింగ్ చేస్తున్నాడట.