Begin typing your search above and press return to search.
గుసగుస.. ప్రశాంత్ నీల్ 'ఉగ్రం' కి 'సలార్' బెటర్ వెర్షన్?
By: Tupaki Desk | 23 Jun 2023 7:00 AM GMTకేజీఎఫ్-కేజీఎఫ్ 2 చిత్రాలతో సంచలనాలు సృష్టించాడు ప్రశాంత్ నీల్. 1000 కోట్ల క్లబ్ దర్శకుడిగా అతడికి భారతీయ సినీప్రపంచంలో ప్రత్యేక గౌరవం దక్కింది. అతడి నుంచి వస్తున్న తదుపరి సినిమా సలార్ పై భారీ అంచనాలున్నాయి. దీనికి కారణం ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ డమ్ ఉన్న హీరో ఇందులో కథానాయకుడిగా నటించడమే. అయితే సలార్ రిలీజ్ ముందు ఈ సినిమాపై రకరకాల రూమర్లు పుట్టుకొస్తున్నాయి.
సలార్ ని ప్రశాంత్ నీల్ తొలిదర్శకత్వ చిత్రం 'ఉగ్రం'తో పోలుస్తూ నెటిజనుల్లో చర్చ సాగడం ఆశ్చర్యపరుస్తోంది. క్రిటిక్స్ నుంచి భారీ ప్రశంసలు పొందిన నీల్ కన్నడ చిత్రం 'ఉగ్రం'కి బెటర్ మెంట్ గా సలార్ ని తీస్తున్నాడని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. సలార్ లో కనికరం అన్నదేలేని శక్తివంతమైన గ్యాంగ్ స్టర్ గా ప్రభాస్ ని చూపిస్తున్నాడు. అయితే లార్జర్ దేన్ లైఫ్ పాత్రలో అతడు భారీ యాక్షన్ తో కట్టి పడేస్తాడని ఊహిస్తున్నారు. ఇది ఉగ్రం పాత్రకు సింబాలిక్ గా ఉంటుంది. ప్రభాస్ కి ఉన్న పాన్ వరల్డ్ ఇమేజ్ కి సరిపోయే విధంగా సంపూర్ణంగా కథ సహా క్యారెక్టరైజేషన్ పరంగా గణనీయమైన మార్పులు చేసారని ఉగ్రం లైన్ నే అసాధారణంగా మార్చారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
తన అసాధారణమైన నేరేషన్ తో మూడు గంటల పాటు ప్రేక్షకుడిని కుర్చీ అంచుకు కట్టిపడేసే నైపుణ్యం ఉన్న ప్రశాంత్ నీల్ ఉగ్రం లైన్ తోనే ఊహించని మ్యాజిక్ చేయబోతున్నాడనేది ఈ గుసగుసల సారాంశం. సలార్ కోసం ఒక గొప్ప విజన్ తో ప్రశాంత్ పని చేసాడు. ఈ చిత్రం కథాంశం సంఘంలో గౌరవం విధేయత అనే రెండు కీలక అంశాలు- ఇతివృత్తం చుట్టూ తిరుగుతుంది. ఎందుకంటే ఉగ్రంలో తన ప్రియమైన స్నేహితుడికి చేసిన వాగ్దానంతో ప్రత్యర్థి మాఫియా ముఠాలకు వ్యతిరేకంగా కథానాయకుడు చేసిన ఎడతెగని యుద్ధం రక్తి కట్టిస్తుంది. గగుర్పాటుకు గురి చేసే యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పుడు సలార్ లో దృఢమైన గ్యాంగ్ స్టర్ పాత్రలో ప్రభాస్ పాత్రకు డెప్త్ ని సంక్లిష్టతను జోడించి క్రూరత్వంతో కూడుకున్న ఎదురేలేని మెషీన్ లాంటి ఒక మ్యాకో మ్యాన్ గా చూపిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
స్టార్-స్టడెడ్ కాస్ట్ లో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన విలన్ గా కనిపిస్తాడు. తన అసాధారణమైన నటనా నైపుణ్యంతో రక్తి కట్టించే పృథ్వీరాజ్ సుకుమారన్ తో ప్రభాస్ బాహాబాహీ నువ్వా నేనా అంటూ సాగే వార్ ప్రజల్ని కుర్చీ అంచుమీదికి జార్చుతుంది. విలన్ ల మధ్య ఘర్షణల తీవ్రతను పెంచుతూనే హీరోతో ట్రాజెడీ క్రియేట్ చేయడం అనే ఎత్తుగడను ఈ కథలో ప్రశాంత్ నీల్ ఎంచుకున్నాడు.
కేజీఎఫ్ లో తాడిని తన్నేవాడొకడొస్తే తలను తన్నేవాడు ఇంకొకడొస్తాడు! అన్న చందంగా సలార్ లోను ఒకరిని మించిన ఒకరుగా విలన్లను ప్రదర్శిస్తారు. ప్రభాస్ -సుకుమారన్ లతో పాటు ఈ చిత్రంలో ప్రతిభావంతులైన శ్రుతి హాసన్ - జగపతి బాబు కూడా కీలక పాత్రల్లో నటించారు. వెండితెరపై పవర్-ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ కోసం అవసరమైన స్టార్ కాస్టింగ్ ని జోడించడమే గాక సాంకేతికంగా అత్యున్నత టీమ్ ని ఎంపిక చేసారు.
'సలార్' సాంకేతిక అంశాలు చర్చించదగినవి. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ లెన్స్ పవర్ ఫుల్ విజువల్స్ ని ఆవిష్కరించగలదు. ప్రశాంత్ నీల్ కథనాన్ని గంభీరమైన ఇతివృత్తాన్ని అతడి ధృక్కోణంలో కెమెరా చూపించగలదు. ఎడిటింగ్ బాధ్యతలను ఉజ్వల్ కులకర్ణి సవ్యంగా నిర్వర్తిస్తున్నారని సమాచారం. మ్యూజక్ మాస్ట్రో రవి బస్రూర్ ఆకర్షణీయమైన ప్రతిధ్వనించే సౌండ్ ట్రాక్ ను రూపొందించడంలో నిమగ్నమై ఉన్నాడు. 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 'సలార్' సినిమాపై అటు ఇండస్ట్రీలోనూ ఇటు అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. సలార్ 28 సెప్టెంబర్ 2023 న విడుదల కానుంది. హద్దులు దాటి హృదయాలను దోచుకునే మరో సినిమా కళాఖండాన్ని చూడాలని ప్రజలు ఆశిస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఆశించిన గొప్ప సినిమాని ఇస్తాడనే అంతా ఎదురు చూస్తున్నారు.