Begin typing your search above and press return to search.
బాహుబలి..దంగల్ వసూళ్లపై సలార్ దాడి తప్పదా?
By: Tupaki Desk | 4 March 2023 8:00 AM GMTఇప్పటివరకూ ఇండియన్ బాక్సాఫీస్ ని వసూళ్లతో షేక్ చేసిన చిత్రాలు రెండే రెండు. అవే 'బాహుబలి'-2.. 'దంగల్'. ఈ రెండు సినిమాలు మొదటి రెండు స్థానల్లో ఉన్నాయి. దంగల్ ఒక భాగంగానే ప్రేక్షకుల ముందుకొచ్చి 2000 కోట్లకు పైగా వసూళ్లని సాధించింది. ఆ తర్వాత రెండు భాగాలుగా రిలీజ్అయిన బాహుబలి కూడా 2000 కోట్లకు పైగా వసూళ్లని సాధించింది. ఆ తర్వాత 1200 కోట్ల వసూళ్లతో కేజీఎఫ్-2.. ఆర్ ఆర్ ఆర్ చిత్రాలు పోటా పోటీగా ఉన్నాయి.
మరి ఇప్పుడా రికార్డులన్నింటిని చెరిపేసే సత్తా ఉన్న సినిమా ఏదైనా ఉంది? అంటే అంతటి స్టామినా 'సలార్' కి ఉందనే టాక్ ఇన్ సైడ్ బలంగా వినిపిస్తుంది. ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తోన్న ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ పై ఇండియా వైడడ్ అంచనాలు భారీగానే ఉన్నాయి. హీరోని ఎలివేట్ చేయడం నీల్ కి కొట్టిన పిండి. కేజీఎఫ్ రెండు భాగాలు కలిపి 1500 కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి.
కేజీఎఫ్ రిలీజ్ అయ్యే సమయానికి యశ్ అంత పాపులర్ నటుడు కాదు. కేవలం డైరెక్టర్ పనితనం తోనే అది సాధ్యమైంది. అటుపై రెండవ భాగం విషయంలో యశ్ ఇమేజ్ పాత్ర కొంత వరకూ పరిమితం. కేవలం ఎలివేషన్ తోనే కథని నడిపి సునాయాసంగా ఇండియా వైడ్ 1200 కోట్లు కొల్లగొట్టారు. ఇవన్నీ బేరీజు వేసి చూస్తే 'సలార్' కి 2000 కోట్లు రాబట్టడం పెద్ద విషయం కాదనే ట్రేడ్ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి.
ఇప్పటికే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఫేమస్. 'సాహో' లాంటి యాక్షన్ కంటెంట్ తెలుగులో ప్లాప్ అయినా హిందీ లో బాగానే వర్కౌట్ అయింది. అక్కడ సినిమా సేఫ్ జోన్ లో ఉంది. ప్లాప్ టాక్ తెచ్చుకున్న 'రాధేశ్యామ్' సైతం ప్రభాస్ ఇమేజ్ 200 కోట్లు ఈజీగా రాబట్టింది. వంద కోట్లు నష్టం వచ్చినా అది దర్శకుడి ప్రతిభకు నిదర్శనం తప్ప! డార్లింగ్ ఇమేజ్ తో సంబంధం లేని అంశం. ఇప్పటికే 'సలార్' గ్లింప్స్ పై పాన్ ఇండియాలో ఆసక్తికర చర్చ సాగుతుంది. డార్లింగ్-నీల్ కాంబోని పర్పెక్ట్ ఛాయిస్ గా జనాల్లోకి వెళ్తుంది. ఈ పాజిటివ్స్ అన్ని సలార్ పై అంచనాలు అంతకంతకు పెంచేస్తున్నాయి. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం 200 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.