Begin typing your search above and press return to search.
సమంత వారిపై చర్యలు తీసుకోనుందా..?
By: Tupaki Desk | 6 Sep 2022 7:32 AM GMTసౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు విడాకుల తర్వాత కెరీర్ మీదనే ఫుల్ ఫోకస్ పెట్టినట్లు కనిపించింది. వరుస ప్రాజెక్ట్స్ కు సైన్ చేస్తూ దూకుడు చూపించింది. ఎప్పటిలాగే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తన అభిమానులతో టచ్ లో ఉంటూ వచ్చింది. అయితే ఉన్నట్టుండి సామ్ సైలెంట్ అయిపోవడం చర్చనీయాంశంగా మారింది.
సమంత గత కొన్ని వారాలుగా ఇన్స్టాగ్రామ్ మరియు ట్విట్టర్ లో యాక్టివిటీ తగ్గించేసింది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా రెగ్యులర్ గా పోస్టులు పెట్టే అగ్ర కథానాయిక.. ఈ మధ్య కాలంలో ఏవో పెయిడ్ ప్రమోషన్స్ కు సంబంధించిన కొన్ని పోస్టులు మినహా ఎటువంటి అప్డేట్లను పోస్ట్ చేయలేదు. అభిమానులతో చిట్ చాట్ నిర్వహించలేదు. సోషల్ మీడియా గైర్హాజరీతో సామ్ పై పలు పుకార్లు పుట్టుకొచ్చాయి.
కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ తమ పరిమితులను దాటి సమంత ఆరోగ్య సమస్యలతో బాధపడుతోందని.. అందుకే ఆమె ఇటీవల కాలంలో అన్నింటికీ దూరంగా ఉంటుందని రూమర్స్ ప్రసారం చేస్తున్నాయి. వ్యూస్ కోసం ఆమె ఫలానా వ్యాధితో బాధ పడుతోందని.. అనారోగ్యం కారణంగానే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా వుండటం లేదంటూ విచిత్రమైన థంబ్ నెయిల్స్ తో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.
అయితే తన ఆరోగ్యంపై దుష్ప్రచారం చేయడం పై బాధ పడిన సమంత.. ఇప్పుడు సదరు యూట్యూబ్ ఛానెల్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోందని టాక్ వినిపిస్తోంది. గతంలోనూ తన వ్యక్తిగత జీవితం గురించి రూమర్స్ క్రియేట్ చేసిన యూట్యూబ్ ఛానల్స్ వెబ్ సైట్స్ పై సామ్ కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే.
అక్కినేని నాగచైతన్యతో విడిపోడానికి సమంత వ్యవహార శైలి కారణమంటూ అప్పట్లో అనేక కథనాలు ప్రచారం చేసి విశ్లేషణలు చేశారు. ఆమెకు వేరొకరితో అఫైర్ ఉందని.. ప్రెగ్నెన్సీ విషయంలో భార్యాభర్తలు గొడవ పడ్డారని పుకార్లు వ్యాపించేలా చేశారు. అయితే తనపై అలాంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేయకుండా నిరోధించడానికి సమంతా హైదరాబాద్ కోర్టును ఆశ్రయించింది.
దీనిపై స్పందించిన కోర్టు.. ఇంటర్నెట్ ఫ్లాట్ ఫార్మ్స్ లో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం గురించి ఆమెతో సహా అన్ని వెబ్సైట్లు మరియు యూట్యూబ్ ఛానెల్స్ ను హెచ్చరించింది. అయితే ఇప్పుడు మరోసారి తనపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోడానికి సమంత రెడీ అవుతోందని.. ఈ మేరకు తన లీగల్ టీమ్ తో చర్చలు జరువుతోందని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.
ఇకపోతే సమంత పూర్తి ఆరోగ్యంగా ఉందని.. ప్రస్తుతానికి ఆమె తన కెరీర్ మీదనే దృష్టి సారిస్తోందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. సామ్ ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' సినిమా పూర్తి చేసింది. అలానే 'యశోద' అనే పాన్ ఇండియా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీని రిలీజ్ కు రెడీ చేస్తోంది.
విజయ్ దేవరకొండ సరసన 'ఖుషి' అనే సినిమాలో సమంత రూత్ ప్రభు హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ్ లో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ తో ఓ ప్రాజెక్ట్ కమిట్ అయింది. 'అరెంజ్ మెంట్స్ ఆఫ్ లవ్' అనే హాలీవుడ్ ప్రాజెక్ట్ తో పాటుగా రెండు హిందీ సినిమాలు కూడా ఆమె చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.