Begin typing your search above and press return to search.
సానియా మీర్జా విడాకులు.. అసలీ రచ్చ ఎందుకు మొదలైంది?
By: Tupaki Desk | 8 Nov 2022 4:48 AM GMTమరోసారి ఇబ్బందికర వార్తల్లో నలుగుతోంది టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో ఆమె విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది.
ఆమె విడాకుల బాట పట్టినట్లుగా కొందరు వ్యాఖ్యానిస్తుంటే.. అదంతా తప్పు అని.. అందులో వాస్తవం ఎంతమాత్రం లేదని చెబుతున్నారు. ఒకవేళ.. అదే తప్పు అయితే.. మరి కంటి ముందు కనిపిస్తున్న ఈ వాదనల మాటేమిటి? అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
గతంలోనూ సానియా.. షోయబ్ లు విడిపోతున్నారని వార్తలు రావటం.. ఆ తర్వాత అవన్నీ తప్పుడు ప్రచారాలుగా తేలిపోవటం తెలిసిందే. అయితే.. ఈసారి పరిస్థితి అందుకు భిన్నం అంటున్నారు. ఇంతకూ అసలీ ప్రచారం ఎందుకు మొదలైంది? ఎలా మొదలైందన్నది చూస్తే.. సానియా మీర్జా సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఒక స్టోరీనే కారణంగా చెప్పాలి. అందులో.. "Where do broken hearts go. To find Allah" (ముక్కలయిన హృదయం ఎక్కడకు వెళుతుంది. అల్లాను అన్వేషిస్తుంది) అంటూ తన ఇన్ స్టాలో ఒక స్టోరీని పోస్టు చేశారు.
ఈ పోస్టును చూసినంతనే ఈ జంట మధ్య మనస్పర్థలు వచ్చినట్లుగా తెలుస్తుందన్న మాట వినిపిస్తోంది. తన ప్రస్తుత మానసిక పరిస్థితిని ప్రతిబింబించేలా సానియా తన పోస్టుతో విషయాన్ని చెప్పేసినట్లుగా చెబుతున్నారు. షోయబ్ తో తనకు కుదరదని.. అందుకే విడాకుల నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అందుకే.. తాను తీసుకున్న నిర్ణయాన్ని పరోక్షంగా పోస్టు రూపంలో చెప్పినట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు.
అంతేకాదు.. కొడుకు పుట్టిన రోజు వేడుకల్ని దుబాయ్ లో ఘనంగా జరిపిన తర్వాత.. మళ్లీ వీరిద్దరు కలిసి ఎక్కడా కనిపించటం లేదన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. సానియాను షోయబ్ మోసం చేశారని.. దీంతో మనసు విరిగిన ఆమె కఠిన నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. పాక్ మీడియాలోనూ ఈ తరహా వార్తలు వస్తుండటం గమనార్హం.
ఇంత జరుగుతున్నా.. సానియా మౌనంగా ఉండటం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. జరుగుతున్న ప్రచారం నిజం కాకుంటే.. ఆ వాదనలో నిజం లేదని.. అదంతా అబద్ధమని ఒక్క పోస్టుతో చెప్పేయొచ్చు కదా? అందుకు భిన్నంగా జరుగుతున్న ప్రచారంపై మౌనంగా ఉండటం విడాకులకు సంకేతమా? అన్నది తేలాల్సి ఉంది. మరి.. ఇప్పటికైనా సానియా రియాక్టు అయితే.. మంచిదన్న మాట వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.