Begin typing your search above and press return to search.
'సత్యాగ్రాహి' ఇప్పుడు తీయాల్సిన సినిమానా?!
By: Tupaki Desk | 28 Dec 2022 4:00 AM GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన 'ఖుషీ' ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించిందో తెలిసిందే. పవన్- భూమిక జంటగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో పవన్ చిన్ననాటి స్నేహితుడు ఏ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ తర్వాత కూడా పవన్ కల్యాణ్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని ఏ.ఎం.రత్నం ప్రయత్నించి విఫలమయ్యారు. అయితే క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ జోడీ 'సత్యాగ్రాహి' అనే పొలిటికల్ థ్రిల్లర్ ని ఆపేసారని కూడా గుసగుసలు వినిపించాయి. అప్పట్లో సత్యాగ్రాహిపై మీడియా రకరకాల ఊహాజనిత కథనాలను వండి వార్చడం సంచలనమైంది.
సత్యాగ్రాహి కథాంశం పూర్తిగా రాజకీయ నేపథ్యం ఉన్న థ్రిల్లర్ మూవీ. దీనికి పవన్ కల్యాణ్ స్వయంగా దర్శకత్వం వహించాలనుకున్నారు. కానీ ఆ సమయంలోనే రిలీజైన 'జానీ' బిగ్ ఫ్లాప్ గా నిలిచి తీవ్రంగా నిరాశపరిచింది. స్వీయ దర్శకత్వంలోని యాక్షన్ ఎమోషనల్ డ్రామా 'జానీ' ఫలితం చూశాక తన దర్శకత్వ ప్రతిభ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినందున పవన్ తీవ్ర నిరాశకు గురయ్యారని దానివల్లనే 'సత్యాగ్రహి' విషయంలో ముందుకు వెళ్లే సాహసం చేయలేదని నిర్మాత ఏం.ఎం.రత్నం తెలిపారు. కేవలం సొమ్ములు పోగేసుకోవాలని పవన్ కల్యాణ్ ఎప్పుడూ అనుకోలేదు. అందుకే ఆ ప్రాజెక్ట్ ను ఆపేశామని ఏఎం రత్నం 'ఖుషీ'(రీమాస్టరింగ్ వెర్షన్ యూట్యూబ్ లో రిలీజైంది) రీరిలీజ్ ప్రమోషన్స్ లో తెలిపారు.
పవన్ కల్యాణ్- ఏం.ఎం.రత్నం కాంబినేషన్ లో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ గా 'ఖుషీ' సంచలనం సృష్టించింది. ఆ తర్వాత రిపీటెడ్ గా పవన్ తో సినిమాలు చేయాలని స్నేహితుడు ఏ.ఎం.రత్నం ప్రయత్నించారు. కానీ రకరకాల కారణాలతో కుదరలేదు. ఒకానొక దశలో సత్యాగ్రాహిని నిలిపివేశాక ఆ ఇద్దరి స్నేహం చెడిందన్న ప్రచారం కూడా సాగిపోయింది. కానీ తమ కాంబినేషన్ మూవీ తిరిగి రాకపోవడానికి కారణాలు వేరని ఇప్పుడు ఏ.ఎం.రత్నం క్లారిటీనిచ్చారు.
ఎట్టకేలకు 2022-23 సీజన్ లో ఈ జోడీ రిపీటవుతోంది. ఈ కాంబినేషన్ లో ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో 'హరి హర వీర మల్లు' తెరకెక్కుతోంది. లేటెస్ట్ పాన్ ఇండియా హైప్ లో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇరుగు పొరుగు భాషల్లోను వీరమల్లు ని భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాన్ వరల్డ్ లో పవన్ హవా సాగుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. తెలుగు-తమిళంతో పాటు అటు హిందీ మార్కెట్ ని ఈ సినిమాతో టార్గెట్ చేస్తున్న పవన్ కల్యాణ్ ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారో చూడాలన్న ఆసక్తి ఇటు అభిమానులు అటు పరిశ్రమలోను నెలకొంది.
ఈ టైమ్ సెట్ అవుతుందేమో...!
నిజానికి 'సత్యాగ్రాహి' కథాంశం నాటి రాజకీయాలనుద్ధేశించి రాసుకున్న స్క్రిప్ట్. అప్పటి రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ పవన్ ఎంథుసియాసిజమ్ తో ముందుకు వెళ్లాలనుకున్నారు. కానీ ఏం జరిగిందో కానీ అకస్మాత్తుగా సెట్స్ కి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. అయితే పవన్ కల్యాణ్ జనసేన పార్టీ నెమ్మదిగా అయినా కానీ ప్రజల్లో బలం పుంజుకుంటున్న ఇలాంటి తరుణంలో 'సత్యాగ్రాహి' లాంటి పొలిటికల్ నేపథ్యం ఉన్న స్క్రిప్టుకి దుమ్ము దులిపి రీవ్యాంప్ చేసి నేటి బర్నింగ్ పాలిటిక్స్ పై సెటైరికల్ కంటెంట్ తో తెరకెక్కిస్తే అది హిట్టవుతుందని పవన్ అభిమానులు భావిస్తున్నారు.
హరిహర వీరమల్లు తర్వాత అలాంటి ప్రయత్నం జరుగుతుందేమో చూడాలని ఆశపడుతున్నారు. ఈరోజుల్లో ఏటికి ఎదురెళుతూ పవన్ కల్యాణ్ రాజకీయాలు చేస్తున్నారు. దుర్భేధ్యమైన శత్రువులు ఎదుట ఉన్నా భయపడకుండా గట్సీగా పొలిటికల్ స్టంట్ ని రన్ చేస్తున్నారు. అందుకే 'సత్యాగ్రాహి' ఇప్పుడు తీయాల్సిన సినిమా అయి ఉంటుందని కూడా చాలా మంది విశ్లేషిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.